Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఘనంగా ఏరువాక రైతు మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులో ఏరువాక రైతు మహోత్సవ వేడుకలు శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రైతు పొలంలో నాగలి పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగరికత యుగంలో పూర్వికులు ఏరువాక పౌర్ణమి పండుగను రైతులు ఘనంగా నిర్వహించుకునే వారన్నారు. కానీ కంప్యూటర్ యుగంలో అవి కనుమరుగు అవుతున్నాయని తెలిపారు. రైతులు పొలానికి నాగలి, మడకలు, కొడవల్లు ఇలా అన్ని పరికరాలు వడ్రంగి వారు తయారు చేసేవారు. యంత్రాలు రావడం వల్ల వడ్రంగి వారికి ఉపాధి కోల్పోయారు. కావున సాంప్రదయాలను రైతులకు దూరం చెయ్యకుండా కొనసాగించాలని రైతు మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న వ్యవసాయ పరిస్థితులలో రైతంగాన్ని, కౌలు రైతులను ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలని, చేతి వృత్తులను ప్రోత్సహించాలని, ఏరువాక మహోత్సవంలో రైతులను భాగస్వాములను చెయ్యాలన్నారు. గ్రామీణ రైతంగాన్ని వ్యవసాయంలో నిలబెట్టేందుకు సాంప్రదయ వ్యవసాయాన్ని కొనసాగించి రైతులకు ఎద్దులు, ఎడ్లబండ్లు, ఇతర పనిముట్లుపై 50 శాతంపై అందించాలన్నారు. అలాగే వ్యవసాయంలో వినియోగించే ట్రాక్టర్లను రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి 50 శాతం సబ్సిడీ పై డీజిల్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి చంద్ర, రాజు, తిక్కన్న, డోలు హనుమంతు, రెక్కల గిడ్డయ్య, రామాంజనేయులు, పంపాపతి, తిమ్మారెడ్డి, గంగన్న, పాలాక్షి, నర్సింహులు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img