Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రత్యేక పూజలు అందుకున్న పెద్దమ్మతల్లి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాలే వీధిలో గల పెద్దమ్మ గుడి లోని పెద్దమ్మ తల్లి ప్రత్యేక పూజలతో భక్తాదులకు దర్శనం ఇచ్చింది. ఈ సందర్భంగా అర్చకులు వెంకటేశ్వర శర్మ అమ్మవారికి విశేష పూజలతో పాటు అభిషేకాలు, పట్టు వస్త్రాలు, నిమ్మకాయ, తులసి మాల, వేపాకు అలంకరణ చేసిన వైనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తదుపరి దాతలు, అర్చకులు పేరిట అర్చనలు, విశేష పూజలను నిర్వహించారు. తదుపరి అన్న ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img