Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎల్ఐసి జీవిత భీమా సేవా కేంద్రం ప్రారంభం

విశాలాంధ్ర – నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణములోని కొత్త బస్టాండ్ ఎదురుగా జీవిత భీమా పాలసీదారుల సేవా కేంద్రాన్ని శనివారం నిర్వాహకులు ఎల్ఐసి జోనల్ మేనేజర్ క్లబ్ మెంబర్ సగినేల స్వామిదాసు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా ఎల్ఐసి ఆత్మకూరు శాఖ బ్రాంచ్ మేనేజర్ పాండురంగ నాయక్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఎం.మధుసూదన్ శెట్టి, విశ్రాంత ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ వేల్పుల ఆనందరావు,విశ్రాంత పోలీసు అధికారి పెరుమాళ్ళ జాన్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ పాండురంగ నాయక్ నూతన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ‘జీవిత బీమా పాలసీదారులకు సేవా కేంద్రం’లో అన్ని రకాల ఎల్ఐసి పాలసీలు సర్వీస్ చేయబడునన్నారు. ఎల్ఐసి కి దేశంలో దాదాపు 248 బ్రాంచీలు,1500 శాటిలైట్ ఆఫీసులు ఉన్నాయన్నారు. వినియోగ కేంద్రాల ఏర్పాటు ద్వారా పాలసీదారులకు మంచి ప్రయోజనాలు ఉన్నాయని ,ప్రజల ప్రయోజనార్ధమే నందికొట్కూరులో స్వామిదాసు ఆధ్వర్యంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పాలసీదారుల సేవ కేంద్రం ఏర్పాటు చేయాలని ఇంతవరకు ఎవరు ప్రయత్నించలేదని ఆ ప్రయత్నాన్ని స్వామిదాసు చేయడం అభినందనీయమని కొనియాడారు. దాదాపు 28 సంవత్సరాలుగా ఎల్ఐసి లో పనిచేస్తూ జోనల్ మేనేజర్ క్లబ్ మెంబర్ స్థాయికి సగినేల స్వామిదాసు ఎన్నిక కావడం అందరికీ సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఏజెన్సీలు ఎన్ని ఉన్నా పాలసీదారులకు సేవా కేంద్రం ఏర్పాటు చేసే ఘనత ఎల్ఐసికే దక్కుతుందన్నారు.ఎల్ఐసి లో కష్టపడే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని,67 సంవత్సరాల అపార అనుభవం ఎల్ఐసికి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్లు రమణయ్య,అజీస్,షేక్ మహబూబ్ బాషా,శ్రీనివాసులు,
తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img