Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నీతి ఆయోగ్‌ సమావేశం ప్రారంభం

దేశ రాజధాని రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో ఈరోజు(శనివారం) నీతి ఆయోగ్‌ 9 వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ కౌన్సిల్‌ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడి అధ్యక్షత వహించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులతోపాటు నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం థీమ్‌ ావిక్షిత్‌ భారత్‌ ఏ 2047్ణ, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం, తీసుకోవల్సిన చర్యలపై ప్రధానంగా ఈ భేటీ కొనసాగనుంది. ఇక ఈ భేటీని విపక్ష పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు బాయ్‌కాట్‌ చేశారు. ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపిందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా దక్షిణాది రాష్ర్టాలపై మోడీ సర్కార్‌ నిర్లక్ష్యం వహించిందని ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్‌ కేటాయింపుల తీరుకు నిరసనగా నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశాన్ని పలువురు సీఎంలు బహిష్కరించారు. వీరిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంలు ఎంకే స్టాలిన్‌, రేవంత్‌ రెడ్డి, సిద్ధరామయ్య, భగవంత్‌ మాన్‌, సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు ఉన్నారు. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ కూడా భేటీకి గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తాను నీతి ఆయోగ్‌ భేటీకి హాజరు కాలేనని కేరళ సీఎం విజయన్‌ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.ఈ భేటీకి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. అయితే, నీతి ఆయోగ్‌ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని మళ్లీ ఉనికిలోకి తేవాలని దీదీ డిమాండ్‌ చేశారు. ావాళ్లు(బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ప్రజల మద్దతు లేదు. విపక్ష రాష్ర్టాలను మోసం చేసి రాజకీయ పక్షపాత బడ్జెట్‌ను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్‌కు ఆర్థిక అధికారాలు లేకపోయినా ఉమ్మడి వేదికపై గళాన్ని వినిపించడాన్ని నా బాధ్యతగా భావించాను్ణ అని ఆమె అన్నారు. ప్రణాళిక సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు సమస్యల పట్ల చర్చించే అధికారం ఉండేదన్నారు. ఈ భేటీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం హాజరయ్యారు. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనను ఏపీ సర్కార్‌ చేపట్టింది. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img