Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్… కాంగ్రెస్‌లో చేరిన మేయర్

బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో భారీ షాక్ తగిలింది. ఖమ్మం నగర మేయర్ నీరజ అధికార పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. తుమ్మల ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్‌తో మరో ఇద్దరు బీఆర్ఎస్ కార్పోరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేయర్ నీరజ, ఆమె భర్త బ్రహ్మంలు మొదటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు. దీంతో వారు కాంగ్రెస్‌లో చేరుతారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు కార్పోరేటర్లలో 11వ డివిజన్ కార్పోరేటర్ సరిపుడి రమాదేవి, 13వ డివిజన్ కార్పోరేటర్ నీరజ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img