Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

దొంగ నోట్లు, బంగారం ముఠా గుట్టురట్టు

విశాఖ జిల్లా, విశాలాంధ్ర ఆనందపురం : అక్రమంగా దొంగ నోట్లు రవాణా చేసినట్లు మధురవాడ ఏసీపీ గురువారం తెలిపారు. వివరాలిలా.. విజయనగరానికి చెందిన 6 గురు వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలతో విశాఖలోని సోమేష్ అనే వ్యక్తితో ముందుగా మాట్లాడుకున్న మేరకు నకిలీ నగదు, బంగారం బిస్కెట్లు, నాణేలు, నకిలీ నగదుగా మార్చడానికి వినియోగించే రసాయనం, కరెన్సీ నమూనా పేపర్లతో విజయనగరం నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో ఆనందపురం వద్ద టాస్క్ పోర్సు సిబ్బంది తనిఖీ చేయగా అసలు బండారం బయట పడింది. దాంతో కేసు నమోదు చేసి అరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించగా నిందితులు పోలీసులకు భీమిలి క్రాస్ రోడ్ వద్ద పోలీసులకు
వివరాలు వెల్లడిస్తున్న మధురవాడ ఏసీపీ సునీల్ ఇతర అధికారులు
హరిలో విజయనగరం జిల్లాకు చెందిన కారు డ్రైవర్ గొర్ల హేమచంద్రరావు (34), విజయనగరం వస్ట్ బాలాజీ వీధికి చెందిన హరి శ్రీసు(44), విజయనగరం గుంకలాం ఎల్లమాంబ గుడి ప్రాంతానికి చెందిన కునుకు హేమంతకుమార్(28) ఉన్నారు. వీరు కాక విజయనగరం అయ్యన్నపేట కూడలి ఎస్ఆర్ కళాశాల ప్రాంతానికి చెందిన ఎం. సుబ్బారెడ్డి (29), విజయనగరం, కుమ్మరి వీరి
విజయనగరం నుంచి విశాఖ వెళ్తుండగా పట్టుబడిన నిందితులు
కాళికాదేవి గుడి ప్రాంతానికి చెందిన దనాల శ్రీనివాస్(34), శ్రీకాకుళం జిల్లా పలాను. మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఇన్న సునీల్(27) కూడా ఉన్నారు. ఈ కేసులో విశాఖపట్నం ప్రాంతానికి చెందిన సోమేస్ పదారిలో ఉన్నాడు. నిందితుల నుంచి నకిలీ కరెన్సీరూ.500 నోట్లు, నకిలీ బంగారం బిస్కెట్లు నకిలీ గోల్డ్ కాయిన్లు, 23 సెల్ పోన్లు, ఒక ల్యాప్టాప్, మారణాయుధాలు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక గ్లిసే బౌద్, కొన్ని రసాయనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సామగ్రి అంతా ఓ యాప్ ద్వారా బుక్ చేసి ఓ ఆన్లైన్ వ్యాపార సంస్థ నుంచి వీరు పొందినట్లు తెలిసిందని, దాటికి కొన్ని రసాయనాలు వినియోగించి వ్యక్తులను మోసిగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అనందపరం సీఐ టి.వి. తిరుపతిరావు, సబ్ ఇన్స్పెక్టర్లు గంట్యాడ సంతోష్, పందిరి శివ ,గాంధీ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img