Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రి కాన్ఫరెన్స్‌ వర్క్‌ షాప్‌

విశాలాంధ్ర- విశాఖపట్నం: రఘు కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో భాగంగా ప్రి కాన్ఫరెన్స్‌ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. అడ్వాన్స్‌డ్‌ యాంటినాస్‌ ఫర్‌ స్పేస్, వెహికులర్‌ అండ్‌ గ్రౌండ్‌ అప్లికేషన్స్‌ అంశంపై ఈ వర్క్‌షాప్‌ని జరిపారు. వర్క్‌షాప్‌లో రావూస్‌ కన్సల్టెంట్స్‌ ఎల్‌ఎల్‌సి(అమెరికా) సిఈఓ డాక్టర్‌ సుధాకర రావు, కస్టమ్‌ మైక్రోవేవ్స్‌ సిటిఓ డాక్టర్‌ స్సిన్సి లీ–యో, నాసా మైక్రోవేవ్‌ ఇంజనీర్‌ డాక్టర్‌ పావ్‌లో ఫొకార్డీ, నాసా నుంచి డాక్టర్‌ నాసీర్‌ చాహత్, డాక్టర్‌ జి.గుప్త, నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లాబరేటరీ నుంచి డాక్టర్‌ జొనాథన్‌ సౌడిర్, ఆర్‌ఎఫ్‌ ఏంటినా ప్రొడక్ట్‌ మేనేజర్‌ అభిషేక్‌ తివారి, సిఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఏరోస్పేస్‌ లాబరేటరీ నుంచి డాక్టర్‌ శివ్‌ నారాయణ, ఎన్‌ఎస్‌టిఎల్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సి.హెచ్‌ అనీల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌ లో అంతర్జాతీయ నిపుణులు సదస్సులో ప్రత్యేక ప్రసంగాలు, నైపుణ్య శిక్షణ అందించారు. ప్రాధమిక విశ్లేషణ, డిజైన్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ల తయారీ, పరీక్షకు ప్రామాణిక అర్హతలు, అంతరిక్ష, భౌగోళిక అనువర్తనాల కోసం యాంటెన్నాల ఉపయోగించడం తదితర అంశాలను వర్క్‌షాప్‌లో నిపుణులు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img