తాడి మనోహర్
విశాలాంధ్ర -అనందపురం : రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన సాగుతుందని ఏ దేప్రాంతం కూడా అభివృద్ధి చెందలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ తాడి మనోహర్ కుమార్ అన్నారు. గురువారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన వ్యక్తం చేసేందుకు కూడా అవకాశం లేకుండా నియంతలాగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయ ధోరణి అవలంబిస్తున్నారన్నారు. సాధారణ ప్రజలు నిత్యవసర వస్తువులు ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు .
ఈ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ తాను భీమిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, వేరే ఎవరికైనా సీటు ఇచ్చినా గెలిపించుకుంటామని తెలిపారు. తన స్వగ్రామం ఆనందపురం లోని భీమన్నదొర పాలెం అని చెప్పారు.
విద్యా, ఉపాధి ,వైద్యం రంగాలలో పూర్తిగా విఫలం అయింది అన్నారు. మూడు రాజధానులు నాలుగో రాజధాని అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి భీమిలి నియోజకవర్గం లో అభ్యర్థిగా పోటీ చేస్తానని , ప్రజల మద్దతు విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు.