Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కౌంటింగ్ నిర్వహణకు పటిష్ఠ భద్రత

జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న చేపట్టే నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలోనికి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, గుర్తింపు కార్డు పరిశీలన చేసిన తరువాతనే అనుమతించాలన్నారు. మొబైల్ ఫోన్స్, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాలోకి అనుమతి లేదన్నారు. నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయాంచాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు విధులు నిర్వర్తించాలన్నారు. సి ఆర్ పి సి 144సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకుండా చూడాలన్నారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతులు లేవన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా బందోబస్తులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా, అప్రమత్తతో విధులు నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
అనంతరం, జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ కౌంటింగ్ చేపట్టే లెండి, జే.ఎన్.టి.యు. ఇంజనీరింగ్ కేంద్రాలను సందర్శించి, అధికారులు, సిబ్బందికి కేటాయించిన ప్రాంతాల్లో వారు నిర్వహించాల్సిన విధులు, చేపట్టకూడని పనుల పట్ల అవగాన కల్పించారు.ఈ కార్య్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ట్రైనీ ఐపిఎస్ ఎం. జావళి అల్ఫాన్స్, పలువురు డీఎస్పీలు, సిఐలు, ఆర్.ఐలు, ఎస్.ఐలు, ఆర్ఎస్ఎస్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img