acaiwater.com www.bonusheda.com www.bonusorti.com www.bonusdave.com gamersbonus.com www.bonusarsiv.com www.bonusfof.com rcflying.net www.bonustino.com www.onlinesporbahisi.com texasslotvip.com gamefreebonus.com bonusrey.com visiopay.com heatextractors.com
Thursday, September 26, 2024
Thursday, September 26, 2024

ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ పై సీతం కళాశాలలో అవగాహన సదస్సు

విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : స్థానిక గాజుల రేగ పరిధిలోగల సీతం కళాశాలలో ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ అంశాల పై విద్యార్ధినీ , విద్యార్దులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది గా డా॥ బీ.బలరామ్ అసోసియేట్ ప్రొఫెసర్ ( ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ , టెక్కలి ) విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ప్రారంభ దశ స్టార్టప్‌లు లేదా వ్యవస్థాపకులకు ఏంజెల్ ఇన్వెస్టర్లుగా పిలువబడే సంపన్న వ్యక్తులు అందించే నిధులను సూచిస్తుందన్నారు . ఈ పెట్టుబడి సాధారణంగా ఈక్విటీ లేదా కన్వర్టిబుల్ డెట్‌కు బదులుగా చేయబడుతుందన్నారు. ఇతర మూలధన వనరులు అందుబాటులో లేనప్పుడు చాలా ప్రారంభ దశలో వ్యాపారాలకు సహాయం చేయడానికి తరచుగా ఉపయోగించబడుతుందన్నారు. వెంచర్ క్యాపిటల్ (విసి) ఫండింగ్ అనేది ఒక రకమైన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడి, ఇక్కడ పెట్టుబడిదారులు ఈక్విటీ లేదా యాజమాన్య వాటాలకు బదులుగా ప్రారంభ-దశ, అధిక-అభివృద్ధి గల కంపెనీలకు మూలధనాన్ని అందిస్తారన్నారు. ఈ నిధులు స్టార్టప్‌లు మరియు బ్యాంక్ లోన్‌ల వంటి సాంప్రదాయక ఫైనాన్సింగ్ మూలాలకు యాక్సెస్ లేని వ్యాపారాలకు కీలకం అని తెలియజేసారు. ఈ సందర్బంగా సీతం డైరెక్టర్ డా॥ మజ్జి శశిభూషన రావు మాట్లాడుతూ స్టార్టప్‌లకు కార్యకలాపాలను స్కేల్ చేయడానికి, ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, కొత్త మార్కెట్‌లలోకి ప్రవేశించడానికి అవసరమైన నిధులను వెంచర్ కాపిటల్ ఫండింగ్ తెలియజేస్తుందన్నారు. సీతం ప్రిన్సిపల్ డా॥ ద్వివేదుల రామమూర్తి మాట్లాడుతూ వెంచర్ కాపిటల్ ఫండింగ్ (వి సి) సంస్థలు తరచుగా విలువైన పరిశ్రమ అనుభవం, వ్యూహాత్మక మార్గదర్శకత్వం మరియు కంపెనీల వృద్ధికి సహాయపడటానికి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మెనేజ్మెంట్ స్టడీస్ హెచ్.ఓ.డీ డా॥ యస్ వరూధిణీ మాట్లాడుతూ ఏంజల్ ఇన్వెస్టమెంట్ ద్వారా అనుభవజ్ఞులైన పెట్టుబడి దారులు , పరిశ్రమ నిపుణులు ఇన్వెస్ట్మెంట్ చేసే విధానాన్ని, నెట్వర్కింగ్ , పెట్టుబడి బద్రపరిచే విదానం వంటి వ్యవహారాల పై విద్యార్దులు తెలుసుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉపాద్యాయులు, కళాశాల విద్యార్దులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img