Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్

వివక్షత లేని స్వేచ్ఛ సమాజాన్ని సాధిద్దాం

విశాలాంధ్ర విజయనగరం టౌన్ : దళిత బహుజన శ్రామిక యూ,నియన్ ఆధ్వర్యంలో 117వ బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తన జీవితాన్ని ప్రజా సంక్షేమానికి అంకితం చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. అంటరానితనం అనే వివక్షతను బాల్య దశలోనే ఎదుర్కొనీ వివక్షత లేని స్వేచ్ఛ సమాసం కావాలని పోరాడారు. క్విట్ ఇండియా ఉద్యమంలో శాసన ఉల్లంఘనోద్యమంలో పాల్గొని అరెస్ట అయి, జైలు జీవితాన్ని గడిపిన దేశభక్తుడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయము సహకార పరిశ్రమలు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖలో పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులవడమే కాకుండా కార్మిక శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి అనేక విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టారు హరిత విప్లవాన్ని ప్రోత్సహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఆహార ధాన్యాలు చేరేలా కృషి చేశాడు రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా అణగారిన వర్గాల అభ్యున్నతికి అనేక రక్షణ చర్యలను ప్రతిపాదించి సమాజంలో వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ల రూపకల్పన చేసి ప్రభుత్వ ఉద్యోగాలు శాసనసభలలో రిజర్వుడు స్థానాలను కేటాయించేందుకు పోరాడారు. కుల వివక్షత వలననే ప్రధానమంత్రిగా కాలేక, ఉప ప్రధానిగా మిగిలిపోయారు.
ఈ కార్యక్రమానికి దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయి ఈశ్వరరావు అధ్యక్షత వహించగా, మాజీ ఎం.ఆర్ పి.ఎస్.జిల్లా అధ్యక్షులు జి సుందర్రావు, దళిత నాయకులు నక్కిడాపు పైడిరాజు, యు.రాము నాయకురాలు దళిత స్త్రీ సమాఖ్య పి.సత్యవతి, డొమెస్టిక్ వర్కర్స్ కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, ఎస్.పార్వతి,ఎస్సీ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు ఎమ్.సూర్యచంద్ర,రాయి మహేష్, చీపురపల్లి ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు యంధవ పోలయ్య తదితరులు పాల్గొని ప్రసంగించగా, బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాల సాధన లో భాగంగా రాజ్యాంగ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ బునారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img