Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

వైకాపా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బెల్లాన చంద్రశేఖర్

విశాలాంధ్ర -విజయనగరం టౌన్ విజయనగరం ఎంపీ స్థానానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోమవారం బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి కి నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు రెండోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అవినీతి రహిత పాలన అందించడం జరిగిందన్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా కచ్చితంగా వైసీపీని గెలిపించి తీరుతారన్న నమ్మకం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంఎల్సి పెనుమత్స సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img