విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో 2022-23విద్యాసంవత్సరంలో ఉన్నత మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఐదువేలరూపాయలను అయ్యగారి ఆనంద్ (అసోసియేట్ ప్రొఫెసర్,విశాఖపట్నం) అందజేసారు.ఆనంద్ తండ్రి అయ్యగారి నరసింహం (ప్రముఖ క్రిమినల్ లాయర్) జయంతి జూలై 1న పురస్కరించుకుని నగదును బహుకరించారు.చొక్కాపు.భవానికి (555 మార్కులు) రెండువేల రూపాయలు, ముప్పినేని.పద్మినికి(553 మార్కులు) వేయి రూపాయలు, కె.రాజేశ్వరికి (553 మార్కులు) వేయిరూపాయలు,మడే మోహన్ కు (525మార్కులు) వేయి రూపాయలను అందజేసారు. ప్రతిఏడాది ఇదేవిధంగా అతడుతండ్రి చదువుకున్న పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తోన్న అయ్యగారి. ఆనంద్ కు హెచ్ఎం.ఇళ్లా ప్రసన్నలక్ష్మి ,ఉపాధ్యాయులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు.