Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

కోట సత్తమ్మ తల్లికి వెండి పాదం వితరణ

విశాలాంధ్ర -విజయనగరం రూరల్ : ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పట్టణానికి చెందిన ప్రముఖ ధార్మికవేత్త అప్పసాని రంగారావు దొర పేర్కొన్నారు. పట్టణంలోని రామానాయుడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ కోట సత్తెమ్మ తల్లి అమ్మవారికి దాతలు సుమారు రెండు కిలోల వెండి పాదాన్ని తయారు చేయించారు. బుధవారం ఈ పాదాన్ని రంగారావు దొర అలంకరింప జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు తన తండ్రి, విజయనగరం మాజీ ఎమ్మెల్యే దివంగత అప్పసాని అప్పన్న దొర (బాబ్జీ రావు) అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిపారు. కరువు కాటకాలు పోయి, సమృద్ధిగా వర్షాలు పడి, పంటలు పండి ప్రజలు ఆయురారోగ్యాలతో వెలసిల్లెందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దాహదపడతాయన్నారు. ఆలయ ధర్మకర్త ఒబ్బిలి శెట్టి రామ్జి మాట్లాడుతూ తమ ఆలయంలో వేంచేసియున్న కోట సత్తమ్మ తల్లి అమ్మవారికి భక్తులు వివిధ సందర్భాలలో ఇచ్చిన విరాళాలతో వెండి బాహువులు, పాదాలు, కిరీటం, 108 పుష్పాలు తదితర ఆభరణాలను తయారు చేయించడం జరిగిందన్నారు. ప్రతిఏటా అమ్మవారి ఆలయం వద్ద పేదలకు అన్నదానం, శివరాత్రికి సహస్త్ర దీపార్చన, సంక్రాంతికి పేదలకు చీరల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను భక్తులు ఇచ్చిన విరాళాలతో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఒబ్బిలి శెట్టి ఏడుకొండలు, ఎం. వెంకటరాజు, చెక్కా త్రినాధరావు, జి.నారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img