Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

పోస్ట‌ల్ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌నంలోకి మ‌నం

విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : పోస్ట‌ల్ శాఖ అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాలు, ఖాతాల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృత‌ అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఆ శాఖ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. జ‌నంలోకి మ‌నం కార్య‌క్ర‌మంలో భాగంగా బుధ‌వారం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో పోస్ట‌ల్ సిబ్బంది ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం హెడ్ పోస్టాఫీసు ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్యేక మేళా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. 10 సంవ‌త్స‌రాల లోపు బాలిక‌ల‌కు సుక‌న్య స‌మృద్ది ఖాతా, మ‌హిళ‌ల కోసం మ‌హిళా స‌మ్మాన్ ఖాతాలు అంద‌రికీ అందుబాటులో ఉన్నాయ‌ని, వీట‌ని వినియోగించుకోవాల‌ని కోరారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతా ద్వారా ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే వివిధ ప‌థ‌కాల‌కు రాయితీల‌ను పొంద‌వ‌చ్చున‌ని తెలిపారు. ఆధార్ మ‌రియు త‌పాల జీవిత బీమా సౌర్యాల‌ను వినియోగించుకోవాల‌ని కోరారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఎంఆర్ క‌ళాశాల అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పి.నూక‌రాజు, అసిస్టెంట్ సూప‌రింటిండెంట్ ఆఫ్ పోస్ట్స్ పి.సుంద‌ర‌నాయుడు, హెడ్ పోస్ట్‌మాష్ట‌ర్ యు.గ‌ణ‌ప‌తిరావు, ఐపిపిబి మేనేజ‌ర్ సిహెచ్ స‌తీష్‌, పిఆర్ఐ ఇ.శంక‌ర‌నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img