Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

నీటి ని వృధా చేయకండి

విశాలాంధ్ర – గంట్యాడ : గంట్యాడ మండలం నరవ గ్రామంలో నీటి పొదుపుపై అవగాహన, చైతన్య కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. గంట్యాడ కెజిబివి పాఠశాల, నరవ జ్యోతి భా పూలే పాఠశాల విద్యార్థులకు జిల్లా గ్రామీణ నీటిసరఫరా , పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆర్ డబ్ల్యు ఎస్ప ర్యవేక్షక ఇంజనీర్బి ఉమాశంకర్ నీటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బంది నీటి ఆవశ్యకత ను విద్యార్థుల కు తెలిపారు.వేసవి వేడిమి తీవ్రత దృష్ట్యా జీవాధారమైన నీటి ని పొదుపు గా వాడాలని సూచించారు..భూగర్భ జలాల పెంపుదలలో ఇంకుడు గుంతల ప్రాముఖ్యత తెలిపారు. ఈ.కార్యక్రమంలో జల్ జీవన్ మిషన్. డిపిఎంయయు ప్రతినిధులు రాఘవ ,లక్ష్మణ్,విజయ్ తో పాటు స్వచ్ఛ భారత్ మండల కో ఆర్డినేటర్ కెవై నాయుడు,కెజిబివి ప్రత్యేకాధికారి అల్లు జ్యోతి,ఉపాధ్యాయులు, స్వచ్జభారత్ కన్సల్టెంట్లు,విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img