Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

ఐసీడీఎస్ పిఓ సుగుణకుమారి అకాల మరణం

విశాలాంధ్ర,సీతానగరం: సీతానగరం, బలిజపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్
సిహెచ్ సుగుణకుమారి( 54) గురువారం సాయంత్రం అకాలమరణం చెందారు. గత మూడురోజులుగా తలనొప్పితో బాధపడుతున్న విధులకు హాజరవుతున్నారని సిబ్బంది తెలిపారు.గురువారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఆమె పాల్గొన్నారని సిబ్బంది తెలిపారు. ఒక్కసారి విపరీత తలనొప్పి రావడంతో విజయనగరం ఆసుపత్రికి వెళ్తూ మార్గమధ్యలో మృతి చెందారు. ఆమె సూపర్ వైజర్ గా ఉంటూ గత ఏడాది రెగ్యులర్ పీఓగా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందాక కొత్తగా ఏర్పాటుచేసిన బలిజిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుకు మొదటి పిఓగా బాధ్యతలను చేపట్టి గతఏడాదిగా అందరితో కలిసి ఉంటూ మంచిఅధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఐసీడీఎస్ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో,జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడతలో జరిగిన కార్యక్రమాల్లో రెండు మండలాల్లో అన్ని సచివాలయంలో జరిగిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పౌష్టికాహారం, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పించడంలోఆమె ప్రత్యేకశ్రద్ధ తీసుకొన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ రూపొందించిన ప్రిజం కార్యక్రమంలో కూడా ఆమె చురుగ్గా పాల్గొని రక్తహీనత నివారణ కోసం అవగాహణ కల్పించారు. ఐసీడీఎస్ సిబ్బందితో ఎప్పటికపుడు సమావేశాలు నిర్వహించి వారికి అన్ని అంశాలు పట్ల అవగాహణ కల్పించి ఐసీడీఎస్ శాఖ లక్ష్యాలు లబ్ధిదారులకు చేరాలని కోరేవారు. మృతి చెందిన ఐసీడీఎస్ పిఓకు ఇద్దరు పిల్లలున్నారు.ఆమెమృతి పట్ల జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విధ్యారాణి ,సీతానగరం, బలిజిపేట మండలాల అధికారులు, ప్రజా ప్రతినిదులు, వైద్యులు,పాత్రికేయులు, రెండుమండలాలకు చెందిన సూపర్ వైజర్లు పూర్ణిమ,సులేఖ,పద్మావతి,180 అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, సహాయకులు, అంగన్వాడి సంఘాల నాయకులు, పలు ఐసీడీఎస్ ల పిఓలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమెసేవలను వారంతా కొనియాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img