విజయనగరం జిల్లా. సంతకవిటి/రాజాం : సంతకవిటి మండలం మామిడిపల్లి యూనిట్ గోవిందపురం గ్రామంలో ఎల్ పాత్రుని వెంకటరమణ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఘనజీ అమృతం తయారీ వాటి ఉపయోగాలు వివరించడం జరిగింది. ఒక ఎకరాకు 400 కేజీల ఆవు పేడ 10 లీటర్ల ఆవు మూత్రము రెండు కేజీల బెల్లము రెండు కేజీల పప్పుల పిండి గుప్పెడు పుట్టమన్ను సహాయంతో ఉండలుగా తయారుచేసి నీడలో ఆరబెట్టి పొలంలో వేసుకొని దుక్కు చేయడం వలన నేలకు కావలసిన పోషకాలు సూక్ష్మజీవులు వృద్ధి డిఏపి యూరియా వాడకాన్ని తగ్గించడం ఎర్రలు విపరీతంగా వృద్ధి చెందడం పంట కావలసిన పోషకాలు లభిస్తాయని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలియచేయడం జరిగింది ఇందులో రైతులు మహిళా సంఘాలు పాల్గొనడం జరిగింది.