విశాలాంధ్ర,సీతానగరం: రాష్ట్ర ఎస్సీ కమీషన్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి జన్మదిన సందర్భంగా శనివారం పలువురు నాయకులు,అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆమెఇంటివద్ద కేకునుకోసి, బోకెను అందజేసిన జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ మంచుపళ్లి శ్రీరాములు, ఎల్ ఐ సి డవలప్మెంట్ నాగభూషణరావు, ఉపాధ్యాయుడు ఈదుబిల్లిశ్రీనివాసరావు, ఆర్ ఎం పి వైద్యుడు ఏకె నాయుడు, చోడవరపు మాధవ, లాయర్ రమణ, బూర్జ సర్పంచ్ గుజ్జల దాసు, ధనంజయ నాయుడు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. జయమణికీ మంచిరోజులు రావడం ఖాయమని తెలిపారు