Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ఇ : టీవల ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చే కాల్స్ తో ప్రజలు సైబరు మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి నకిలీ కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎం. దీపిక, ఐపిఎస్ పిలుపునిచ్చారు.ఈ తరహా మోసాల్లో సైబరు మోసగాళ్ళు ప్రజల మొబైల్స్ కు ఫోను చేసి తాము ఫెడెక్స్ లేదా బ్లూ డాట్ కొరియర్ నుండి మాట్లాడుతున్నామని, మన గురించిన చిరునామా, ఆధార్ నంబరు, ఫోను నంబరు వంటి కొంత సమాచారాన్ని ముందుగా మనకు తెలిపి, మనము బుక్ చేసిన కొరియర్ పార్సిల్లో నిషేదిత మాదక ద్రవ్యాలు, ఫేక్ పాస్పోర్టు, బంగారం వంటివి ఉన్నాయని, మనీ ల్యాండరింగుకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు, మాదక ద్రవ్యాలను థైవాన్, చైనా వంటి దేశాలకు పంపుతున్నారని నిర్ధారణ అయ్యిందని, కేసు కూడా నమోదయ్యిందని, విచారణ నిమిత్తం తాము సూచించిన ప్రాంతానికి దర్యాప్తు నిమిత్తం రావాల్సి ఉంటుందన్న సమాచారంను అందిస్తారన్నారు. అంతేకాకుండా, సదరు మోసగాళ్ళు ఫోనును కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ లేదా టాస్క్ ఫోర్స్ లేదా పోలీసు అధికారులకు కలుపుతామని తెలిపి, వేరే వ్యక్తులకు ఫోను కనెక్ట్ చేస్తారన్నారు. తదుపరి సైబరు మోసగాళ్ళు తమను పోలీసు అధికారిగా లేదా సిబిఐ అధికారిగా లేదా ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకొంటూ, తన గుర్తింపు కార్డుగా నకిలీ ఐడి కార్డును పంపి, బుక్ చేసిన పార్సిల్ లో మాదకద్రవ్యాలు ఉన్నాయని, బంగారం, నకిలీ పాస్పోర్టు వంటి వస్తువులు ఉన్నాయని, కేసు కూడా నమోదయ్యిందని, దర్యాప్తు నిమిత్తం తమ వద్దకు రావాల్సి ఉంటుందని భయపెడతారన్నారు. తాము రాలేని పరిస్థితుల్లో ఉన్నామని చెబితే, ఆన్లైనులో కూడా దర్యాప్తుకు హాజరుకావచ్చునని, తమకు ఒక లింకు పంపుతున్నామని, వాటిపై క్లిక్ చేసి, స్కైప్లో దర్యాప్తుకు హాజరుకావాలని సూచిస్తారన్నారు. సైబరు మోసగాళ్ళ పంపిన లింకును క్లిక్ చేస్తే, తమ బ్యాంకు సేవింగు ఖాతాల్లోని నగదు చోరీకి గురవుతుందన్నారు. మరికొన్నిసార్లు తమతో మాట్లాడిన వివరాలను ఎవ్వరికీ తెలపకుండా గోప్యంగా వుంచాలని చెప్పి, తమపై నమోదైన కేసులో సహాయం చేస్తామని, చర్యలు నిలిపేస్తామని నమ్మించి, తాము సూచించిన బ్యాంకు ఖాతాకు భారీగా నగదు పంపాలని కోరుతారన్నారు. తమ బ్యాంకు ఖాతాను రిజర్వు బ్యాంకు సహకారంతో పరిశీలించాల్సి ఉందని, వివరాలు సేకరించి, ఖాతాలో డబ్బును కాజేస్తారన్నారు. కావున, ప్రజలందరూ ఇటువంటి సైబరు మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫెడెక్స్, బ్లూ డాట్ వంటి కొరియర్ సర్వీసులతో వచ్చే నకిలీకాల్స్ ను నమ్మి, సైబరు మోసాలకు గురికావద్దన్నారు. ఈ తరహా సైబరు మోసగాళ్ల కాల్స్ కు భయపడాల్సిన పని లేదని, ఇటువంటి కాల్స్ కు ప్రజలెవ్వరూ స్పందించ వద్దని, ఆయా నంబర్లు నుండి వచ్చే కాల్స్ ను బ్లాక్ చేసి, సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషనుకు అందించాలన్నారు. ఎవరైనా నగదును పోగొట్టు కొన్నట్లయితే 1930 కు లేదా నేషనల్ సైబరు క్రైంపోర్టల్ లో రిపోర్టు చేయాలని ప్రజలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img