Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వెంకటాపురంలో పొలంబడి నిర్వహణ

విశాలాంధ్ర, సీతానగరం: మండలంలో మండల వ్యవసాయాధికారి ఎస్.అవినాష్ అధ్యక్షతన డా. వై.ఎస్. ఆర్ పొలంబడి కార్యక్రమంను వెంకటపురం గ్రామంలో గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రసాయనిక ఎరువులను తగ్గించటంతోపాటు నేల ఆరోగ్యం కాపాడటంలో పచ్చిరొట్ట ఎరువులు కీలకమైన పాత్ర పోషిస్తాయన్నారు.ఖరీఫ్ పంట కాలానికి ముందే జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయటం వల్ల భూసారం పెరుగుతుందని ,పచ్చిరొట్ట ఎరువులను భూమిలో కలియదున్నటం ద్వారా భూమి క్షారత్వం తగ్గుతుందన్నారు. దాని వల్ల ముందుగా ఏర్పడిన చౌడు సమస్యను తగ్గించుకోవచ్చని ,భౌతిక లక్షణాలు మెరుగవుతాయని,భూమిలో నీటిని నిలుపుకొనే సామర్థ్యంతో పాటుగా గాలి కదలిక కూడా మెరుగవుతుందని తెలిపారు.వరి సాగులో నారుమడి యాజమాన్యం చాలా కీలకమని, మడి తయారు చేసుకోవడం, విత్తనశుద్ధి, తెగుళ్ల నివారణ జాగ్రత్తలు తీసుకుంటే నారు ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు.నారు మడి పెంపకంపై రైతులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, వరి నారు మడి వేయాలనుకుంటే ముందుగా వేసవికాలంలోనే లోతు దుక్కులు చేసుకోవాలని,నారుమడిని 12 రోజుల వ్యవధిలో మూడు దఫాలు దమ్ము చేసి చదును చేయాలని,నారుమడి లో నీటిని పెట్టేందుకు, నారుమడి నుంచి నీటిని బయటకు పంపించేందుకు కాలువలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.కంది విత్తనాలు గట్లపై వేసుకుని అధిక ఆదాయం పొందేవిధంగాలా ప్రభుత్వం నుంచి ఉచితంగానే అందిస్తున్నామన్నారు. రైతుభరోసా కేంద్రం నుంచి రైతులందరూ కంది విత్తనాలు తీసుకోవాలని చెప్పారు.చేలల్లో గట్ల వెంబడి కంది నాటితే వరికి హాని కల్గించే శత్రు పురుగులైన ఆకుముడత, కాండం తొలుచు పురుగులు, సుడిదోమను నివారించవచ్చని, రైతుకు మిత్రులైన సాలీడు, తూనీగ, అక్షింతల పురుగులు కంది మొక్కలపై నివాసం ఉంటాయని ,ఇవి శత్రు పురుగులను నాశనం చేసి పంటను రక్షించేందుకు ఉపయోగపడతాయని తెలియచేశారు.అదేవిధంగా
ఈకార్యక్రమంలో ప్రి-బ్యాలెట్ బాక్స్ పద్ధతి నిర్వహించటం జరిగింది .ఈపద్ధతి ద్వారా రైతులు మిత్ర, శత్రు పురుగుల మీద ఎంత వరకు అవగాహన కలిగి ఉన్నారన్నది తెలుసుకోవటం జరిగింది.అదే విదంగా ఆ పురుగుల యొక్క లాభ , నష్టాలు గూర్చి వివరిస్తూ వాటి ద్వారా ఏ విధంగా ఖర్చు తగ్గిస్తూ అధిక ఆదాయం పెంచుకోవచ్చని తెలియచేయటం జరిగింది.రైతులందరితో కలిసి బృంద విన్యాసాలు చేయించటం జరిగింది.ఈకార్యక్రమంలోవిఏఏ, పొలంబడి రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img