Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

24గంటలు గడవక ముందే నిందితులు అరెస్ట్

వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి.వెంకటరావు
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : పట్టణం తోటపాలెం ఎయిమ్స్ స్కూల్ వెనక భాగంలో మార్చి 21న పశువులను మేపుతున్న ఒక వృద్ధురాలి మెడలో చైను దొంగిలించిన ఇద్దరు నిందితులను 24 గంటలు గడవక ముందే అరెస్టు చేసి, దొంగిలించిన బంగారు చైను, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి.వెంకట్రావు మార్చి 22న తెలిపారు.
వివరాల్లోకి వెళితే తోటపాలేం కు చెందిన బంక గురుమూర్తమ్మ (60 సం.లు) అనే వృద్ధురాలు ఎయిమ్స్ స్కూల్ వెనుక భాగంలో పశువులను మేపుతుండగా అక్కడకు వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి సదరు మహిళ యోగ క్షేమాలు అడుగుతున్నట్లుగా మాట్లాడి, చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్న తరువాత వృద్ధురాలి మెడలో చైను లాగుకొని, కొద్ది దూరంలో ఉన్న మరొక వ్యక్తి మోటారు సైకిలుపై ఇరువురు పరారీ అయినట్లుగా వన్ టౌన్ పోలీసులే స్టేషనులో ఫిర్యాదు చేయగా వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు.వన్ టౌన్ క్రైమ్ ఎస్ఐ జే.తారకేశ్వరరావు, క్రైమ్ బృందం నేర స్టలంను సందర్శించి, కొన్ని ఆధారాలు సేకరించి, నేరంకు పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. పూసపాటి రేగ చాకలివీధికి చెందిన నిందితులు (ఎ-1) మామిడి సత్య కుమార్ (ఎ-2) గురాన భార్గవ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి బంగారు చైను, నిందితులు వినియోగించిన రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో నిందితులు ఫిబ్రవరి మాసంలో వెంకటేశ్వర స్వామి కోవెల సమీపంలో ఇదే తరహా నేరంకు పాల్పడినట్లు అంగీకరించారని ఇన్స్పెక్టర్ బి.వెంకటరావు తెలిపారు. ఈ కేసులో వన్ టౌన్ ఎస్ఐ జే.తారకేశ్వర రావు, హెడ్ కానిస్టేబుల్ ఎం.అచ్చిరాజు, కానిస్టేబుళ్లు శివ, గౌరీ శంకర్ క్రియాశీలకంగా పని చేశారని, వారిని ఉన్నతాధికారులు అభినందించారు సిఐ వెంకటరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img