Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మత్స్య కారులంటే మమకారం…

శెట్టిబలిజ, గౌడ లపై ఎక్సైజ్ కేసులు ఎత్తేస్తా..

నరసాపురం
జనసేన అడ్డా…

బహిరంగ సభలో పవన్…

విశాలాంధ్ర, నరసాపురం: మత్స్య కారులు అంటే మమకారం అని.. వారికి ఆర్థిక భరోసా కల్పించడమే తన ధ్యేయం అని… 70లక్షల మత్స్యకార కుటుంబాలకు జనసేన అన్ని రకాలుగా అండగా ఉంటుందని జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మత్స్యకారుల జీవన స్థితి గతులను మెరుగు పరుస్తానని, వేటకు వెళ్లే మత్స్యకారులకు రూ.10లక్షల భీమా సౌకర్యం కల్పిస్తామ న్నారు. సెట్టిబలిజ, గౌడ సోదరులపై పెట్టిన
ఎక్సైజ్ కేసులను కూటమి ప్రభుత్వం ఎత్తి వేస్తుందని హామీ ఇచ్చారు.
ఒక్క కులం.. ఒక వర్గం కోసమో పార్టీ పెట్టలేదని, అన్ని వర్గాల ప్రజల అండ దండలు తనకు కావాలన్నారు. కాపుల కోసం పార్టీ పెట్టలేదని, కులాలకు, మతాలకు అతీతంగా ఉన్న వాడినని,
అన్ని వర్గాల అభిమానంతో ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. లేసు అల్లికలకు పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు. ఆక్వా పరిశ్రమను ఆదుకుంటామని, రైతుకు అండగ నిలుస్తాం అన్నారు. ముస్లిం సోదరులు
బిజెపిపై అపోహలు పడవద్దని సూచించారు. మత ప్రచారంపై స్వేచ్ఛ ఉందని పాస్టర్ లు గురించి వివరించారు. తిరుమలలో అన్య మత ప్రచారం వొద్దు అని చెప్పటం జరిగిందని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే వ్యక్తిని, రాజ్యాంగంను నమ్మిన వ్యక్తి మంచి రాజకీయ నాయకులు అవుతారని తెలిపారు. సమకాలీన సమాజంలో యువకులు, మహిళలూ సమూహం అవసరం అని, ఈ ఎన్నికల్లో చాటి చెప్పాలని పిలుపు ఇచ్చారు. కులాలును విడగొడతే… తాను ఏకం చేస్తానని,
విప్లవకారుడు పాలిటిక్స్ చేస్తే ఎలాగు ఉంటుందో చేసీ చూపిస్తా నని సవాల్ విసిరారు.
సమాజంలో స్వేచ్చ కావాలని, చిరంజీవికి, రజనీకాంత్ లకు స్వేచ్ఛ లేదని,
స్వేచ్ఛ అనే పదం తనకు చాలా ఇష్టం అని పవన్ స్పష్టం
చేశారు. అన్న.. అజాత శత్రువని, ఆయను గురించి కారు కూతలు కూస్తే నాలుక తెగ్గడతా నని ఆగ్రహం వ్యక్తంచేశారు. చిరంజీవి, రాష్ట్ర ప్రజల జోలికి వస్తె ఖబడ్దార్ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. ప్రజల భవిష్యత్తు కోసం తాను అన్ని విధాలుగా తగ్గానన్నారు .

వైసీపీ ట్రాప్ లో పడొద్దు..

నర్సాపురం సాక్షిగా చెబుతున్నా..
వైసీపీ ట్రాప్ లో పడొద్దు అని,
వచ్చేది కూటమి ప్రభుత్వం అని పవన్ తెలిపారు.
జగన్ చిల్లర వ్యవహారాలు మానుకోవాలన్నారు.
జగన్ గొడుకు కిందకు వెళ్లిన వారంత గూండాలుగా మారుతున్నారని పవన్ తెలిపారు.
వైసీపీ ముఖ్య నాయకులు
డబ్బు, అధికారంతో విర్ర విగుతున్నారని,
సింహాలు కాదు… గుంటనక్కలు అని వైసీపీ నాయకుల తీరును ఎండ గట్టారు.
ఎన్నికలలో పిచ్చి కూతలు కుస్తే
వైసీపీ గుండాలకు, రౌడిలకు తగిన బుద్ధి చెబుతాం అని హెచ్చరించారు.
గత ఐదేళ్లలో
బూతులు అసెంబ్లీ చూసామని,
నోరు జారినా … తప్పుచేసినా మా పవర్ చూపిస్తామని
వైసీపీ నాయకులను పవన్ హెచ్చరించారు.
జగన్ నువ్వు ఎంత…
నీ బతుకు ఎంత అని,
అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి తో పవన్ కల్యాణ్ గా మాట్లాడుతున్నానని తెలిపారు.
సింహాలు కాదు
పందికొక్కులు సమూహం అని సజ్జల పై విరుచుకు పడ్డారు.ఈ కార్యక్రమంలో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి బి. నాయకర్, పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాస వర్మ, మాజీ ఎమ్మెల్యేలు మాధవ నాయుడు, సుబ్బా రాయుడు, నాయకులు చాగంటి చిన్నా, కోటిపల్లి వెంకటేశ్వర రావు రామరాజు తదితరుల పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img