Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఆ ఎమ్మెల్యేలకు టెన్షన్‌

. ముంచుకొస్తున్న డెడ్‌లైన్‌
. టికెట్లు దక్కవేమోనని ఆందోళన
. పనితీరు బాగోలేని వారితో వైసీపీ అధినేత భేటీలు
. ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖాముఖి భేటీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ‘మీరు మారతారా?, లేక నన్నే మార్చమంటారా అంటూ’ వారిని గట్టిగా హెచ్చరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించలేని ఎమ్మెల్యేలను ఐ ప్యాడ్‌ సర్వేల ఆధారంగా వెనుకబడినట్లుగా గుర్తించారు. వచ్చే సెప్టెంబరులోగా వారి పనితీరు మార్చుకోకుంటే ఇక టికెట్లు కష్టమంటూ అధినేత స్పష్టం చేయడంతో వారికి మింగుడు పడటం లేదు. పనితీరు బాగోని ఎమ్మెల్యేల వివరాలను ఆ సమావేశంలో జగన్‌ వెల్లడిరచకుండా ఒక్కొక్కర్నీ తన తాడేపల్లి కార్యాలయానికి పిలిపించుకుంటున్నారు. ఇప్పటికే కొందరు వచ్చి సీఎంను కలిశారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, నెల్లూరు జిల్లాకు పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తదితర ఎమ్మెల్యేలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికైనా పనితీరు మెరుగుపర్చుకోవాలని, టికెట్ల విషయంపై అప్పుడే చెప్పలేమంటూ నొక్కి చెప్పినట్లు సమాచారం. ఈ తరహాగా 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారంతా జగన్‌ను కలవలేదు. కొందరు సీనియర్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో అలక వహించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి దాదాపు 25 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు గల్లంతయ్యే పరిస్థితులున్నాయి.
పదవులిస్తామంటూ బుజ్జగింపులు
ఎమ్మెల్యేగా గెలుపునకు అవకాశంలేని సిట్టింగ్‌లలో కొంతమందిని ఎంపీలుగా ప్రమోట్‌ చేసి,మరికొందరికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామంటూ జగన్‌ సర్ది చెబుతున్నట్లు ప్రచారముంది. నియోజకవర్గ పనితీరులో వెనుకబాటుకు గురైన వారిలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలున్నారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు పొందాలనే ఆశతో వారున్నారు. ఎంపీలుగా పోటీకి దించాలనే జగన్‌ నిర్ణయంపై వారంతా ఆసక్తి చూపడం లేదు. తమకు మళ్లీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుంటే ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఇప్పటికే నలుగురు పార్టీని వీడారు. వారి బాటలోనే మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఇంకా మూడు నెలలే…
ప్రజల్లో గ్రాఫ్‌ సరిగ్గా లేని ఎమ్మెల్యేలంతా సెప్టెంబరులోగా పనితీరు మెరుగు పర్చుకోవాలని సీఎం ఇచ్చిన గడువుకు ఇంకా మూడు నెలలే మిగిలింది. ఇంత తక్కువ సమయంలో ఏం చేయాలా అనే దానిపై ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఆ 18 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వైసీపీ ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమించింది. కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతంలో పనితీరులో వెనుకబడిన ఎమ్మెల్యేలున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళా మంత్రితోపాటు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు వెనుకబాటుకు గురయ్యారు. గుంటూరు జిల్లా నుంచి మాజీ మహిళా మంత్రి, ప్రకాశంజిల్లా నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే, నెల్లూరు నుంచి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరుల పేర్లు విన్పిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల నుంచి మరి కొందరున్నారు. వీరంతా వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు వస్తాయా?, లేదా? అంటూ ఎమ్మెల్యేలు కలవరం చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img