Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉచిత కంటి ఆపరేషన్లు పేద ప్రజలకు ఒక వరము లాంటివి

రోటరీ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు.. జయ సింహ, నాగభూషణ
విశాలాంధ్ర -ధర్మవరం : ఉచిత కంటి ఆపరేషన్లు పేద ప్రజలకు ఒక వరము లాంటిదని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ కార్యదర్శి నాగభూషణ కోశాధికారి సుదర్శన్ గుప్తా, క్యాంపు చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో మంగళవారం కంటి ఆపరేషన్ శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని కళాజ్యోతి ప్రాంగణంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. శిబిరా దాతలుగా కీర్తిశేషులు ఉబ్బర రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం (ఆర్ ఆర్ గ్రాండ్ బిల్డింగ్స్ యజమాని- అనంతపురం)కుమార్తె లిఖిత అల్లుడు విశ్వ తేజ రెడ్డి లు వ్యవహరించనున్నారని తెలిపారు. ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి-బెంగళూరు, అనంతపురం జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి పరీక్షలకు వచ్చువారు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డులలో ఏదేమి రెండు జిరాక్స్ కాఫీలు 3 ఫోటోలు తప్పకుండా తీసుకొని రావాలని తెలిపారు. చిన్న పిల్లలకు, వికలాంగులకు తగిన ప్రాధాన్యత కల్పించబడినది తెలిపారు. కంటి వైద్య చికిత్సలతో పాటు రవాణా సౌకర్యము, ఆపరేషన్లు పూర్తిగా ఉచితమేనని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివయ్య, రత్న శేఖర్ రెడ్డి, ప్రసన్న కుమార్, గట్టు హరినాథ్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img