Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మహోగ్ర యమున

. దిల్లీ జల దిగ్బంధం
. ఎర్రకోటను తాకిన వరద
. ప్రధాన రోడ్లు, ఇళ్లు జలమయం
. సీఎం కేజ్రీవాల్‌ ఇంటివద్దకు నీరు
. 45 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని వరద
. 208 మీటర్లు దాటిన నీటిమట్టం
. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన దిల్లీ ప్రభుత్వం

న్యూదిల్లీ: యమునా నది ప్రమాదకరస్థాయిని మించి మహోగ్రంగా ప్రవహిస్తోంది. దిల్లీని ముంచెత్తుతోంది. 45 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని వరదలకు దేశ రాజధాని వీధులు నదిలా మారాయి. లోతట్టు ప్రాంతాలే కాదు… ప్రధాన రోడ్లు, ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి. దిల్లీలోని చారిత్రక కట్టడం ‘ఎర్ర కోట’ను కూడా వరద నీళ్లు తాకాయి. యమునా ఘాట్‌ నుంచి ఎర్రకోటకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినప్పటికీ అంత దూరం వరద నీళ్లు వచ్చాయంటే… పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎర్రకోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మంత్రుల కార్యాలయాలు సైతం జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇండియా గేట్‌ కూడా వరద నీటితో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు. యమునా నది ఒడ్డు నుంచి కేవలం దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో, వరద నీటిలో చిక్కుకున్న రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఇండియా గేట్‌ ఉంది. ఇక రోడ్లు… కాలువలను తలపిస్తున్నాయి. మోకాలి లోతుకుపైగా వరదనీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలతో పాటు రాజ్‌ఘాట్‌ నుంచి దిల్లీ సచివాలయం వరకు ఉన్న ప్రాంతాలన్నీ జల దిగ్బం ధంలో చిక్కుకున్నాయి. ఇంత దూరం వరదలు వస్తాయని ఊహించని స్థానికులు…ఇప్పుడు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఎర్రకోట చుట్టూ ఉండే వ్యాపారులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోతున్నారు. ఎర్రకోట దాకా వచ్చిన వరద… ఇంకెంత దూరం పోతుందనేది ఆందోళన కరంగా మారింది. ఎర్రకోట వరకు యమునా నది నీళ్లు రావటం 45 ఏళ్లలో ఇదే తొలిసారి. యమునా నది ఈ స్థాయిలో ప్రవహించటం కూడా ఇదే మొదటిసారి. హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా నుంచి నదిలోకి వరద పోటెత్తటంతో ఈ పరిస్థితి వచ్చిందని దిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ప్రస్తుతం యమునా నదిలో నీటి ప్రవాహం 208 మీటర్ల ఎత్తులో సాగుతోంది. దిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం 208 మీటర్లను దాటేసింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 208.62 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నదీ ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇది తీవ్రమైన పరిస్థితి అని కేంద్ర జల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 45 పడవలతో 16,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ బ్యారేజి నుంచి నీటిని విడుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని దిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కేంద్రం స్పందిస్తూ, బ్యారేజ్‌లో సామర్థ్యాన్ని మించి ఉన్న నీటిని విడుదల చేయవలసి ఉంటుందని స్పష్టం చేసింది. భారీ వర్షాల వల్ల హిమాచల్‌ ప్రదేశ్‌లో విపరీతమైన విధ్వంసం జరిగింది. అక్కడి నుంచి నీరు ఈ జలాశయంలోకి వస్తోంది. దిల్లీలోని సివిల్‌ లైన్స్‌ ఏరియాలో రింగ్‌ రోడ్డు వరదలో చిక్కుకుంది. మజ్ను కా తిల-కశ్మీరీ గేట్‌ ఐఎస్‌బీటీ మార్గాన్ని మూసివేశారు. ఇక్కడి నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో కేజ్రీవాల్‌ నివాసం, దిల్లీ శాసన సభ ఉన్నాయి. హరియాణాలోని బ్యారేజ్‌ నుంచి నీటి ప్రవాహం గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తగ్గే అవకాశం ఉందని కేంద్ర జల కమిషన్‌ తెలిపింది. పాత దిల్లీ వరద ప్రభావిత ప్రాంతం కావడంతో నిగంబోధ్‌ ఘాట్‌ శ్మశాన వాటికను ఉపయోగించవద్దని అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 12 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సేవలందిస్తున్నాయి. నిజానికి దిల్లీ నగరంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు లేవు. అయితే యమునా నదిలోకి హరియాణా నుంచి నీటిని విడుదల చేస్తుండటం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వజీరాబాద్‌లోని సిగ్నేచర్‌ బ్రిడ్జ్‌ సమీపంలో, గర్హి మండు గ్రామం వరద నీటిలో మునిగిపోయింది. ఐటీఓ, కశ్మీరీ గేట్‌, జీటీ కర్నాల్‌ రోడ్‌, బోట్‌ క్లబ్‌, మోనాస్టరీ మార్కెట్‌, నీలి ఛత్రి టెంపుల్‌, యమునా బజార్‌, నీమ్‌ కరోలీ గోశాల, విశ్వకర్మ కాలనీ, న్యూ ఉస్మాన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో నీరు చేరింది.
కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కేజ్రీవాల్‌ విజ్ఞప్తి
యమునా నదిలో నీటి ప్రవాహం గంటగంటకూ తీవ్రరూపం దాలుస్తుండటం వల్ల కేంద్రం జోక్యం చేసుకోవాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. హరియాణాలోని హత్నికుంద్‌ బ్యారేజ్‌ నుంచి తక్కువ మొత్తం లో నీటిని విడుదల చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని దిల్లీ కేంద్ర
హోంశాఖ మంత్రి అమిత్‌ షాను అభ్యర్థించారు. కొన్నివారాల్లో దిల్లీ జీ-20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుందన్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం కేజ్రీవాల్‌. రాజధానిని వరద ముంచెత్తిందన్న సమాచారం ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలను పంపుతుందన్న కేజ్రీవాల్‌… ఈ సంకట పరిస్థితుల నుంచి దిల్లీ ప్రజలను కలిసికట్టుగా కాపాడుకోవాల్సి ఉందని అమిత్‌ షాను కోరారు. నది సమీపంలోని రోడ్లు వినియోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు కాపాడడం చాలా మఖ్యమని… అందుకోసం ప్రజలు సహకరించాలని సీఎం కోరారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. యమునా నది మహోగ్రరూపం దాల్చడంతో తలెత్తే పరిస్థితులపై చర్చించేందుకు డీడీఎంఏ సమావేశమైనట్టు కేజ్రీవాల్‌ వెల్లడిరచారు. దిల్లీలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలన్నింటికీ ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. అత్యవసరం కాని ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశం కల్పించిన కేజ్రీవాల్‌ సర్కార్‌… ప్రైవేటు కార్యాలయాలకు సైతం వర్క్‌ఫ్రమ్‌ హోంకు అవకాశం కల్పించాలని సూచించింది. అత్యవసర సేవలతో కూడిన భారీ వాహనాలను మాత్రమే దిల్లీ లోపలికి అనుమతించనున్నట్టు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. దిల్లీ ప్రజలంతా సంయమనంతో ఉండాలని.. త్వరలోనే యమునా నది నీటి మట్టం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. కాగా దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా దిల్లీ విపత్తు నిర్వహణ బృందంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img