Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ముందస్తు వలసలు

. నేతల ఎన్నికల ఫీట్లు
. లోకేశ్‌తో వైసీపీ ఎంపీ ముచ్చట్లు!
. జనసేనలోకి ‘ఆమంచి’
. అధికార పార్టీలో ఆందోళన

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏడాదిలోగా ఎన్నికలు ఉండటంతో రాజకీయ పార్టీల్లో వలసల సందడి మొదలైంది. ఈ నాలుగేళ్లలో ప్రతిపక్ష టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు భారీగా రాగా, ఇటీవల దానికి రివర్స్‌గా వైసీపీ నుంచి టీడీపీలోకి ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ఎలాంటి కేడర్‌ లేదనుకునే జనసేనలోకి సైతం వైసీపీ నుంచి వలసలు రావడం అధికార పక్షాన్ని కలవరానికి గురిచేస్తోంది. విశాఖజిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు వైసీపీకి రాజీనామా చేసి, ఆ పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చారు. ఇది వైసీపీ పార్టీకి కోలుకోలేని దెబ్బ కానుంది. రెండేళ్ల క్రితం వైసీపీలోకి వచ్చిన ఆయన, తిరిగి పార్టీని వీడారు. ఇటీవలే ఆయన రాజీనామాను ప్రకటించి, తాను పార్టీ బలోపేతానికి కృషి చేద్దామనే ప్రయత్నానికి చుట్టూ ఉండే అధినాయకత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఇక టీడీపీలోకి ఏకంగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వస్తున్నారని తెలిసింది. ఇటీవల శ్రీచెతన్య విద్యా సంస్థల అధినేత బీఎస్‌ రావు అంత్యక్రియల సందర్భంగా, అక్కడికి వచ్చిన టీడీపీ నాయకుడు లోకేశ్‌తో ఆ ఎంపీ కరచాలం చేయడం, పక్కకెళ్లి ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకోవడం చర్చానీయాంశంగా మారింది. ఆయన టీడీపీలోకి వెళ్తారా? అనే ఆందోళనలో వైసీపీ కేడర్‌ ఉంది. చాలా కాలం నుంచి ఎంపీ కృష్ణదేవరాయలు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ప్రధానంగా అమరావతి రాజధాని విషయంలోనూ ఆయన రైతులకు నేరుగా మద్దతివ్వడం అప్పుడు పార్టీ వర్గాల్లో చర్చానీయాంశమైంది. దీని ఆధారంగా ఆయన టీడీపీకి చెంతకు చేరుతారని సమాచారం. ఇప్పటికే వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గుంటూరు జిల్లా చెందిన ఉండవల్లి శ్రీదేవిని ఆ పార్టీ సస్పెండ్‌ చేసింది. వారిలో కోటంరెడ్డి, ఆనం, చంద్రశేఖర్‌రెడ్డిలు టీడీపీకి దగ్గరయ్యారు. ఉండవల్లి శ్రీదేవి ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. ఈ పరిణామాలతో వైసీపీ కోట బీటలు వారనుందని భావిస్తున్నారు. మరోపక్క వైసీపీలో టికెట్లు లభించని వారంతా టీడీపీ, బీజేపీలోకి వెళ్లేందుకు దారులు వెతుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తులపై స్పష్టత వస్తే, వారి చేరికలపైనా స్పష్టత వచ్చే అవకాశముంది.
వైసీపీ వ్యూహాలపై సొంత ఎమ్మెల్యేల్లో ఆగ్రహం
వైసీపీ వ్యూహాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆగ్రహంగా ఉన్నారు. ఐ ప్యాడ్‌ సర్వేల ఆధారంగా వైసీపీ ముందుకెళ్తోంది. అది వారికి మింగుడు పడటం లేదు. హిందూపురం వైసీపీ నూతన ఇన్‌చార్జ్‌గా దీపికారెడ్డిని నియమించారు. ఇప్పటివరకు అక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఇక్బాల్‌ను ఆ పదవి నుంచి ఆధిష్ఠానం తొలగించింది. దీనిపై మాట్లాడేందుకు ఇటీవల ఆయన సీఎం జగన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరినా దక్కలేదు. దీంతో ఇక్బాల్‌ ఆధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇటీవల జరిగిన ప్రాంతీయ, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సమావేశానికి సైతం హిందూపురం ఇన్‌చార్జ్‌ హోదాలో ఆమె రావడం చర్చానీయాంశమైంది. ఎన్నో ఏళ్ల నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా మారింది. అక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా బాలకృష్ణ రెండు విడతలుగా గెలుపొందారు. ఈ సారి ఎలాగైనా హిందూపురంలో పాగా వేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ వైసీపీలోకి వెళ్తారని, చిత్తూరుజిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఆయన బరిలో ఉంటారని సమాచారం. కొంతకాలం నుంచి టీడీపీకి ఆయన దూరంగా ఉంటున్నారు. గుంటూరు ఎంపీ బరిలోకి అంబటి రాయుడును వైసీపీ రంగంలోకి దించనుంది. ఇప్పటికే రాయుడు గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో పర్యటిస్తున్నారు. కాపు సామాజిక ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన తనయుడు వైసీపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు ఆ పార్టీ నేతలు సంకేతాలిస్తున్నారు. అదును చూసుకుని ఆయన కుటుంబం వైసీపీలోకి రానుంది. దానిపై ముద్రగడ ఇంతవరకు స్పందించలేదు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌కు, ముద్రగడ మధ్య లేఖల యుద్ధం నడిచింది. పరస్పరం విమర్శలు చేసుకున్న విషయం విదితమే. పవన్‌ కు పోటీగా కాపు సామాజిక వర్గం నుంచి ముద్రగడను వైసీపీ తెరపైకి తెచ్చే ప్రయత్నం ఆరంభించింది.
జనసేనలోకి చేరికలు
జనసేనలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ప్రకాశంజిల్లాకు చెందిన ఆమంచి స్వాములు ఇటీవల పవన్‌ కల్యాణ్‌ అధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. అంతకుముందు భారీగా కార్ల ర్యాలీతో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ ప్రాంతానికి చెందిన పంచకర్ల రమేష్‌బాబు సైతం జనసేన గూటికే చేరతారని సమాచారం. ఉభయగోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు జనసేనలోకి వస్తారని తెలుస్తోంది. ఆ దిశగా ఆ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం పార్టీ శ్రేణులతోనే నెట్టుకొస్తున్న జనసేనలోకి ఒకరిద్దరు ముఖ్య నాయకులు రావడం..కార్యకర్తల్లో ఉత్సామం నింపుతోంది. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తుండటంతో ముందస్తుగానే రాజకీయ పార్టీల హడావుడి ప్రారంభించాయి. ఏపీ బీజేపీ అధ్యక్షులిగా దగ్గుబాటి పురంధేశ్వరిని ఆ పార్టీ ఆధిష్ఠానం నియమించింది. దీంతో ఆమె పార్టీ బలోపేతానికి కృషి ప్రారంభిస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు అవకాశాలు అధికంగా ఉన్నాయి.
దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్డీయే సమావేశానికి జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను ఏపీ నుంచి ఆహ్వానించారు. అటు టీడీపీకి ఆహ్వానం పంపకపోవడం చర్చానీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img