Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మాది బలం
వారిది నిస్సహాయత

ప్రతికూల భావాలతో ఏర్పడ్డ విపక్ష కూటమి ఫలించదు
2024లో గెలుపు మాదే – ప్రపంచ దేశాలకూ ఇది తెలుసు
ఎన్డీయే భేటీలో మోదీ

న్యూదిల్లీ : ఎన్డీయే అంటే బలం… ప్రతిపక్షాల కూటమి నిస్సహాయతకు ప్రతిబింబం అని ప్రధాని మోదీ విమర్శించారు. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేసుకొని రాజకీయంగా నాటకాలు ఆడుతున్న ప్రతిపక్షాల వాస్తవికత 140 కోట్ల భారతీయులకు తెలియనది కాదని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి అన్నారు. వీరంతా కలిసి ఉన్నట్లు చెప్పుకుంటున్నారు కానీ వారి మధ్య అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయని, కలిసి పనిచేయలేరని వ్యాఖ్యానించారు. జీవితాంతం ఎవరినైతే వ్యతిరేకించారో ఇప్పుడు వారినే నెత్తిన పెట్టుకోవడాన్ని ఆయా పార్టీల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రతికూల భావనతో ఏర్పడిన ఏ కూటమి విజయం సాధించిన దాఖలాలు లేవని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే మూడోస్థానానికి చేరుస్తామని హామీనిస్తున్నానని మోదీ అన్నారు. మళ్లీ మేమే గెలుస్తామని ప్రపంచ దేశాలకూ తెలుసు కాబట్టే అనేక దేశాల నుంచి ఎన్డీయే ప్రతినిధులకు ఆహ్వానాలు, సన్మానాలు లభిస్తున్నాయి అని అన్నారు. దిల్లీలోని ది అశోక హోటల్‌లో మంగళవారం జరిగిన ఎన్డీయే సమావేశానికి 38 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో ఎన్డీయేను వీడిన పార్టీలు కొన్ని మళ్లీ చేరాయి. ఆయా పార్టీల నేతలంతా మోదీకి గజమాలలతో సన్మానించారు. చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జన్‌శక్తి పార్టీ ఎన్డీయే కూటమిలో చేరగా చిరాగ్‌ను మోదీ ఆప్యాయంగా కౌగిలించుకోవడం సమావేశాల్లో ప్రత్యేకంగా నిలిచింది. ఈశాన్య రాష్ట్రాల నేతలు, శివసేన` ఏక్‌నాథ్‌ షిండే, లోక్‌ జనసేనకు చెందిన పవన్‌ కళ్యాణ్‌, అన్నాడీఎంకేకు చెందిన పళనిస్వామి, ఇతర ప్రముఖ నాయకులు హాజరైన వారిలో ఉన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ ఎన్డీయేను దేశాభివృద్ధి కోసం ఏర్పాటైన కూటమని, అన్ని ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసం, ఆశీర్వాదమే తమలో శక్తిని నింపుతోందని చెప్పారు. దేశంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాగానీ అమెరికా, జపాన్‌, యూఏఈ తదితర దేశాలు ఎన్డీయే ప్రతినిధులను ఆహ్వానిస్తుండటంతో మరలా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయని చెప్పారు. భారతీయ ప్రజలు ఎన్డీయేను నమ్ముతారని ప్రపంచానికి తెలుసు. ఎన్డీయే విస్తరణ కేవలం భారతదేశానికి పరిమితం కాదు. ఎన్డీయే చరిత్రతో పాటు కెమెస్ట్రీని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు కాబట్టే లెక్కలు సరిగ్గా కుదురుతాయన్నారు. ఎన్డీయే సేవాభావానికి 2014లో ఘన విజయాన్ని ప్రజలు కట్టబెట్టారని ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని అన్నారు. సుస్థిరత కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు అయిందే తప్ప ఎవరిని అస్థిరపర్చేందుకు కాదని అన్నారు. ఎన్డీయే నిర్వచనం నూతన అభివృద్ధి ఆకాంక్షలని అన్నారు. దేశ వికాసమే తమ లక్ష్యమని, అభివృద్ధి పథం భారత్‌ దూసుకెళుతోందని, ఇందుకు తొమ్మిదేళ్ల కిందటే పునాది పడిరదని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే ఓట్లశాతం 50శాతాన్ని మించుపోనున్నదని విశ్వాసంగా చెప్పారు. మూడోసారి అధికారంలోకి వస్తామని మోదీ ఉద్ఘాటించారు. దేశంలోని ప్రతి వర్గ సంక్షేమం, వికాసమే అజెండాగా పనిచేస్తామని హామీనిచ్చారు.
తమకు సంబంధించిన వరకు కూటమి అంటే బలహీనత కాదు బలమని చెప్పారు. తానెన్నడు తప్పుడు ఉద్దేశాలతో ఎలాంటి పని చేయబోనని హామీనిస్తున్నాని, తన తన జీవితం, తన శరీరంలో ప్రతి అణువు దేశానికి అంకితమని మోదీ నొక్కిచెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img