Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఫీజు కడితేనే… పరీక్ష

. కళాశాల విద్యార్థులపై యాజమాన్యాల ఒత్తిళ్లు
. ‘జగనన్న విద్యాదీవెన’లో జాప్యం
. కొందరి ఖాతాల్లోనే డబ్బు జమ
. విద్యార్థుల చదువులకు ఆటంకం

విశాలాంధ్రబ్యూరో-అమరావతి : ‘కళాశాల ఫీజు కట్టాల్సిందే…లేకుంటే సెమిస్టర్‌ పరీక్ష ఫీజు కట్టించుకోబోం’ అంటూ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. జగనన్న విద్యాదీవెనలో జాప్యం జరగడం విద్యార్థులు, తల్లిదండ్రుల పాలిట శాపంగా మారింది. సకాలంలో ఈ సొమ్ము అందరి తల్లుల ఖాతాల్లోకి జమకానందున వారి చదువులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. తమకు జగనన్న విద్యాదీవెన వస్తుందనే ఆశతో వివిధ డిగ్రీ కోర్సుల్లో చేరిన కొంతమంది విద్యార్థులకు చుక్కెదురవుతోంది. మొదటి ఏడాది విద్యా సంవత్సరం నుంచి అష్టకష్టాల నడుమ ప్రభుత్వం నిధుల్ని ఆలస్యంగా జమ చేయడం, తిరిగి ఆయా కళాశాలల యాజమాన్యానికి వాటిని ఫీజుల రూపంలో చెల్లించడం పరిపాటిగా మారింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి మొదలైంది. చేసేదేమీ లేక విద్యార్థుల తల్లిదండ్రులు బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నానా ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మూడ నెలలకొకసారి జమ చేస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి 2023 త్రైమాసికానికి రూ.9.95లక్షల మంది విద్యార్థులకు రూ.703 కోట్లను సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన విషయం విదితమే. దీనివల్ల ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. అయితే గడచిన త్రైమాసికానికి సంబంధించిన నిధులు కొందరి తల్లుల ఖాతాల్లోకి జమ కానందున, వారి పిల్లల చదువుల ఫీజులు చెల్లించలేక పోయారు. దీంతో కళాశాలల యాజమాన్యం నుంచి వారిపై ఒత్తిళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలోని గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం ఫీజులు కడితేనే సెమిస్టర్‌ పరీక్షలకు ఫీజు కట్టేందుకు అనుమతిస్తామంటూ విద్యార్థులకు అడ్డంకులు సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దానిపై విద్యార్థులు, తల్లిదండ్రులు, పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అక్కడకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.
ఇదే పరిస్థితి చాలా ప్రైవేట్‌ కళాశాలల్లోనూ నెలకొంది. జగనన్న విద్యా దీవెనతో మాకు సంబంధం లేదని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థులు ముందస్తుగా కళాశాల ఫీజు కట్టాలని, అలా కట్టిన వారితోనే సెమిస్టర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు అనుమతిస్తామని చెబుతున్నాయి. ఆ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కమిట్‌మెంట్‌ లెటర్లు తీసుకుంటున్నారు. అటు అధికారులు మాత్రం సాంకేతిక లోపాల కారణంగానే కొందరి ఖాతాల్లో నిధులు జమ కావడం లేదంటూ దాట వేస్తున్నారు. లబ్దిదారుగా ఉన్న తల్లి ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాకు అనుసంధానం సక్రమంగా లేకపోవడం, సమాచారం ఇవ్వకపోవడం వెరసి నిధుల జమపై జాప్యమవుతున్నట్లు చెబుతున్నారు.
పూర్తిగా అందని అమ్మఒడి నిధులు
అమ్మ ఒడి నిధులు కూడా పూర్తిస్థాయిలో లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లోజమ కాలేదు. ఈనెల 22 లోగా తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని వలంటీర్లు చెబుతున్నారు. దీనికి కారణం సాంకేతిక లోపాలని, తల్లుల ఆధార్‌, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కానందునే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. సీఎం జగన్‌ అమ్మఒడి నిధులను లాంఛనంగా విడుదల చేసినప్పటికీ అవి పూర్తిగా జమ కాకపోవడం పట్ల తల్లులు ఆందోళన చెందుతున్నారు. అటు జగనన్న వసతి దీవెనలోనూ అక్కడక్కడా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడకూడా సాంకేతిక సమస్యలే ఎదురవుతున్నాయి. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు వాయిదాల్లో ప్రభుత్వం చెల్లిస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌`రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఇది కూడా అందరికీ సకాలంలో రావడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థుల చదువులకు ఆటంకాలు వస్తాయనే ఆందోళనతో తల్లిదండ్రులు బయట అప్పులు తెచ్చి ఫీజులు కడుతున్నారు.
విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుడా ఉన్నత విద్యా మండలి నియంత్రణ, పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ స్పందించాల్సిన అవసరముంది. ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన నిధులను వెంటనే విడుదల చేయాలని, అంతవరకు విద్యార్థులను సెమిస్టర్‌ పరీక్షలకు హాజరయ్యేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img