Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రైతు రుణ మాఫీ చేయాలి

. స్వామినాథన్‌ సిఫార్సుల అమలుకు చర్యలు
. సాగు సాయంగా రూ.10వేలు అందించాలి
. రైతుసంఘం అధ్వర్యాన రాష్ట్రవ్యాప్త ధర్నాలు
. ప్రభుత్వ వైఫల్యాల వల్లే వ్యవసాయ సంక్షోభం: కేవీవీ ప్రసాద్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట సోమవారం ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైనందున సాగు చేస్తున్న రైతులకు ఎకరానికి రూ.10,000 సాగుసాయం అందించాలని, డా॥ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర ఇచ్చి…దానికి చట్టబద్ధత కల్పించాలని, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఉపకరణాలను 90 శాతం సబ్సిడీతో అందించాలని, వ్యవసాయ విద్యుత్‌్‌ మోటార్లకు మీటర్లు బిగించాలనే ఆలోచనను ఉపసంహరించుకొని ఉచిత విద్యుత్‌ కొనసాగించాలని, అన్ని పంటలకు పంటల బీమా వర్తింపచేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, పెరుగుతున్న పంటల ఖర్చులకనుగుణంగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పెంచి రుణాలివ్వాలని, రైతు, కౌలు రైతుల అన్ని రకాల పంట రుణాలను రెండులక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని, కేరళ తరహా రుణ ఉపశమన చట్టం తీసుకురావాలని, 50 ఏఉ్ల పైబడిన రైతు, కౌలు రైతులకు నెలకు 10 వేల రూపాయలు పింఛను అందించాలని రైతులు నినదించారు. అనంతపురం కలెక్టరేట్‌ ముందు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిరుతల మల్లికార్జున అధ్యక్షతన జరిగిన ధర్నాకు ముఖ్య అతిథులుగా రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల వల్లే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడిరదని మండిపడ్డారు. సాగు ఖర్చులు పెరిగి గిట్టుబాటు ధరలు లేక పంటలు నష్టపోవడం వల్ల రైతులు అప్పులమీద అప్పులు పెరిగిపోయాయని, ఈ బాధలతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ పాలకుల్లో స్పందన కానరావడం లేదన్నారు. రైతే రాజు అన్న నినాదం కేవలం పాలకుల ఉపన్యాసాలకే పరిమితమవుతుందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు తమ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెట్‌ ధరలకనుగుణంగా రేట్లు ఏటేటా గణనీయంగా పెంచి లాభాలు దండుకుంటుండగా, వారికే ప్రభుత్వాలు వేల కోట్లు రాయితీలిస్తున్నాయన్నారు. రైతుకు మాత్రం తాను పండిరచిన వ్యవసాయ ఉత్పత్తులకు ధర నిర్ణయించుకునే అధికారం లేదని, మరోపక్క పాలకులూ కరుణించడం లేదన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రైతుల దగ్గర పెట్టుబడులకు డబ్బులు లేకపోవడం వల్ల వ్యవసాయం వైపు మొగ్గు చూపలేకపోతున్నారని, తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. రైతు ఆత్మహత్యల నివారణకు కేరళ ప్రభుత్వం తరహాలో సంపూర్ణ రుణమాఫీ ప్రకటించాలని కోరారు. సమగ్ర పంటల బీమా విధానాన్ని ప్రవేశపెట్టి దిగుబడి ఆధారంగా పంటల బీమాని వర్తింపచేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం రైతులందరూ సమిష్టిగా ఉద్యమించాలని ప్రసాద్‌ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీశ్‌ మాట్లాడుతూ కర్నాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై ఎగువభద్ర, నవలి ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ప్రాజెక్టు నిర్మాణాలు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని, పంటల సాగు చేయలేని దుస్థితిలో ఉన్నారని, ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే తినడానికి తిండి కరువయ్యే పరిస్థితి దాపురిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నప్పయాదవ్‌, లింగమయ్య, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు.
మద్దతు ధర కోసం చట్టం చేయాలి: డేగా ప్రభాకర్‌
రైతు, కౌలు రైతు పండిరచిన పంటకు మద్దతు ధర కోసం చట్టం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు డేగా ప్రభాకర్‌ డిమాండ్‌ చేవారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. డేగా ప్రభాకర్‌, దొంతా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ కటాఫ్‌ తేదీతో నిమిత్తం లేకుండా కౌలు కార్డులు ఉన్నవారందరినీ గుర్తించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. ఎరువులు, పురుగు మందులు, డ్రిప్‌ పరికరాలు 90 శాతం సబ్సిడీతో ప్రభుత్వమే అందజేయాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతు, కౌలు రైతులకు నెలకు రూ.10 వేలు పింఛను ఇవ్వాలని, రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని, రైతు రుణ విమోచన చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు.
ఎన్టీఆర్‌ జిల్లాలో
రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో రైతులు సీపీఐ కార్యాలయం నుంచి గాంధీ సెంటర్‌ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి, ధర్నా చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు దోనేపుడి శంకర్‌, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య మాట్లాడుతూ అన్ని పంటలకు సర్వే నెంబరు యూనిట్‌గా పంటల బీమా వర్తింపచేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ చుండూరు వెంకట సుబ్బారావు, ఏఐయస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఉప్పుటూరి అరుణ్‌ కుమార్‌, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కట్టా చామంతి, మండల కార్యదర్శి మన్నే హనుమంతరావు, పట్టణ కార్యదర్శి వేముల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img