Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పేట వాసులకు పాసింజర్ రైలు రాదా…?

దోనెపూడి శంకర్

. ఓట్లను గుర్తించిన ప్రజాప్రతినిధులు ప్రయాణ సౌకర్యాన్ని గుర్తించరా
. పేట ప్రజలకు అందని ద్రాక్ష లాగా రైలు
. ప్రజా సమస్యలపై స్థానిక శాసనసభ్యునితో చర్చకు సిద్ధం
. ప్రజల వ్యయ ప్రయాసలను పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
. వర్తక వాణిజ్యానికేనా రైలు


విశాలాంధ్ర – జగ్గయ్యపేట: దాదాపుగా లక్షకు పైగా జనావాసం కలిగి ఉన్న జగ్గయ్యపేట పట్టణానికి పాసింజర్ రైలు లేకపోవడం అత్యంత దారుణమైన విషయమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ కార్యదర్శి దోనెపూడి శంకర్ విమర్శించారు ….. సిపిఐ బృందంతో కలిసి రైల్వే ట్రాక్ లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేట ప్రజల పరిస్థితి అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు గా ఉందన్నారు.జగ్గయ్యపేట పట్టణం మీదుగా వర్తక వాణిజ్యానికి సంభందించి మాత్రమే పలు రైళ్లు తిరుగుతున్నప్పటికీ, ప్రయాణికుల సౌకర్యార్థం పాసింజర్ రైలును ఏర్పాటు చేయలేకపోవడం శోచనీయమైని అసహనాన్ని వ్యక్తపరిచారు.ఇప్పటికే విజయవాడ, మధిర మీదుగా జగ్గయ్యపేట నుండి సికింద్రాబాద్ వరకు ప్యాసింజర్ రైలు పరుగులు తీయడానికి పూర్తి స్థాయిలో లైన్ పూర్తి అయి, ప్యాసింజర్ రైలు ను సైతం ట్రైల్ రన్ గా నడపడం జరిగిందని ఆయన అన్నారు.సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం దేశంలో రైల్వే లు నూతనంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప జగ్గయ్యపేట ప్రాంత ప్రజల కి రైల్వే లైన్ పూర్తి అయి కావలసిన ప్యాసింజర్ రైలు ను నడపకపోవ డం అత్యంత బాధాకర విషయమన్నారు. ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థం అవుతుందని ఆయన విమర్శించారు.ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యుడు , పార్లమెంటు కి వెళ్ళుతున్న యంపి గాని ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం దారుణమన్నారు.ఇప్పటికైనా విజయవాడ ఎంపి శ్రద్ధ తీసుకుని పార్లమెంటులో పోరాడి జగ్గయ్యపేట పట్టణానికి చిరకాల కోరిక అయిన విజయవాడ నుంచి జగ్గయ్యపేట మీదుగా ప్యాసింజర్ రైలు ని సికింద్రాబాద్ వరకు తిరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట పట్టణ మరియు ప్రజా సౌకర్యార్థం వేగవంతంగా ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోకపోయినట్లయితే ఉన్నత స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు… సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్ధం ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి పాసింజర్ రైలు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తేవాలని కోరారు.భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో నిరసనల వెల్లువ ఉవ్వెత్తున ఎగిసి పడబోతుందని ప్రజా ప్రతినిధులు విస్మరించినప్పటికీ సిపిఐ పార్టీ ప్రజా సమస్యలపై నిర్విరామంగా పోరాడుతూనే ఉంటుందని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి అంబోజి శివాజీ, పట్టణ సహాయ కార్యదర్శి మాశెట్టి రమేష్,పోతుపాక వెంకటేశ్వర్లు,మెటికల శ్రీనివాసరావు , జానీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img