Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పర్యావరణాన్ని పరిరక్షించాలి….

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి…..

విశాలాంధ్ర -భీమవరం:పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మొక్కలు నాటి పెంచాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కోరారు.ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం లో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఎస్ అధికారుల సతీమణుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది.దీనిలో భాగంగా శుక్రవారం స్థానిక గొల్లవానితిప్ప రోడ్డు వెంబడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి సతీమణి సి.ప్రసన్నతో కలిసి ప్రారంభించారు. జిల్లా నీటి యాజ‌మాన్య సంస్థ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. గంగ రావి, పచ్చ తురాయి, బునియ, సీమ తంగిడి, గానుగ, పండ్ల మొక్కలు, త‌దిత‌ర‌ ర‌కాలకు చెందిన సుమారు 400 మొక్క‌ల‌ను రెండు కిలోమీటర్ల పరిధిలో నాటారు.ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ గ్రీన్ ఎర్త్ … గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో ఐ ఏ ఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.ఈ సందర్బంగా పర్యావరణ కాలుష్య నివారణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఐఏఎస్ ఆఫీసర్స్ సతీమణులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ సతీమణి సి.ప్రసన్న ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఁహరిత పశ్చిమగోదావరి ఁ జిల్లాగా రూపురేఖలు మార్చడం కొరకు డ్వామా, ఇండస్ట్రీస్, ఎన్జీవోస్, విద్యాసంస్థలు ఆధ్వర్యంలో 50 వేల మొక్కలు ఒకేసారి జిల్లాలో నాటుతున్నామని కలెక్టరు తెలిపారు. ఒక మొక్కకు ప్రాణం పోస్తే జీవితకాలం మనకు ఉపయోగపడుతుందన్నారు. మనం వినియోగించే ప్రతి వస్తువు మొక్కల నుంచి వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఉద్యమంలా మొక్కలు నాటుతున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ స్థలాలన్నింటిలో మొక్కలు నాటుతున్నామని వివరించారు. మొక్కలు మానవాళికి ఎంతో మేలు చేస్తానన్నారు. పశ్చిమగోదావరి జిల్లాను పచ్చతోరణంగా చేయడం కోసం భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు వాటిని సంరక్షణ చేసే బాధ్యత తీసుకోవాలని పిలుపు నిచ్చారు. నేడు కాంక్రీట్ జంగిల్ గా పట్టణాలు, గ్రామాలు రూపు దిద్దుకోవడం, వాహనాలు పెరగడం తో వాతావరణం విపరీతమైన కాలుష్యం బారిన పడడం చూస్తున్నామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొక్కలు నాటి వాటి పరిరక్షణ సామాజిక బాధ్యతగా చేపట్టి ఆహ్లాదకర వాతావరణంలో గల చక్కని గ్రీనరీని తీర్చిదిద్దుదామన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నా మన్నారు. వాతావరణ మార్పులు సవాళ్లు, సహజ వనరుల పరిరక్షణ ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇది ఒక ముఖ్యమైన సందర్భమని కలెక్టరు పేర్కొన్నారు.
గొల్లవాని తిప్ప లో మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి వారి సతీమణితో వచ్చి మొక్కలు నాటారు. జిల్లా అంతటా నేటి నుండి మూడు రోజులు పాటు 50 వేల మొక్కలు నాటే లక్ష్యంగా ఈరోజు ఒక్కరోజే 25 వేల మొక్కలు నాటడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.ఈ సంద‌ర్భంగా న‌గ‌ర‌వ‌నం ప‌థ‌కంలో భాగంగా చేప‌ట్టిన ఈ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో డీసీఎంఎస్ చైర్మన్ పివిఎల్ నరసింహారాజు, డ్వామా పిడి ఎస్.టి.వి రాజేశ్వరరావు, డి ఆర్ డి ఎ పి డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిఇఓ ఆర్. వెంకటరమణ, ఉపాధిహ‌మీ ఏపిడి విజయలక్ష్మి,, ఉపాధిహామీ సిబ్బంది, పాఠశాలల విద్యార్థులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img