London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

పురంధేశ్వరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా.. టీడీపీ అధ్యక్షురాలా ? : మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన కామెంట్స్‌కు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ హయాంలో ఎక్కువ అప్పులు చేశారని.. ప్రతిపక్షంలో ఉంటేనే చంద్రబాబుకు అప్పుల గురించి గుర్తుకు వస్తుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పేవన్నీ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నదుల అనుసంధానం గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.ఆంధ్రప్రదేశ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతు,పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి తొమ్మిదేళ్లయ్యింది.. ఆయన పార్టీ పెట్టిందే ప్యాకేజీల కోసమని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే ఆయన లక్ష్యమన్నారు. పురంధేశ్వరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా.. టీడీపీ అధ్యక్షురాలా అన్న సందేహం వస్తోందన్నారు. చంద్రబాబు ఏం మాట్లాడతారో ఈమె కూడా అదే మాట్లాడుతున్నారన్నారు.
పవన్ ను పట్టించుకునేవారు లేరన్నారు. జగన్ ప్రభుత్వం పారదర్శకత్వంగా నిధులు ఖర్చు పెడుతోందని.. ఇప్పటికైనా పురంధేశ్వరి అబద్దాలు చెప్పడం మానేస్తే మంచిదన్నారు. అధికారంలో ఉంటే అప్పుల గురించి ఊసే ఎత్తని చంద్రబాబు.. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అప్పుల గురించి తెగ గోల చేస్తారన్నారు.ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు నుంచి నందమూరి కుటుంబం లాక్కోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అప్పు తక్కువ అని చెప్పారని.. చంద్రబాబు హయాంలో తలకు మించిన అప్పు చేశారని.. ఈ నదుల్ని ఇక్కడ కలపాలి అక్కడ కలపాలని చంద్రబాబు నాయుడు మ్యాప్ తీసుకుని పిచ్చిగా పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు గాడిదలు కాశారా అంటూ ధ్వజమెత్తారు. ఆయన అధికారంలో ఉన్నని రోజులు సంక్షేమం, అభివృద్ధి గుర్తు రాదని.. ప్రతిపక్షంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం గుర్తు వస్తుందా అని ప్రశ్నించారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో నదులు అనుసంధానం కన్నా నిధులు అనుసంధానం చేయడంలో ఆసక్తి ఎక్కువ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లెక్చరర్‌లా బోర్డ్‌లో ప్రజంటేషన్ ఇస్తూ నదులు అనుసంధానం గురించి ఏదేదో చెబుతున్నారని సెటైర్లు పేల్చారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.లక్షల కోట్ల సంక్షేమం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు మంత్రి రోజా. చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పి.. ప్రజలకు ఎం చేస్తారో వాగ్థానాలు ఇవ్వాలన్నారు. పవన్‌ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్కలు తేలాలని మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ పవన్‌కు నివేదిక ఇచ్చిందో చెప్పాలన్నారు. హెరిటేజ్‌లో గంజాయి, నారావారిపల్లెలో ఎర్ర చందనం దొరుకుతోందని.. రాష్ట్రంలో ఇంకెక్కడా గంజాయి దొరకలేదన్నారు. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సీమ ప్రాజెక్టు లను పరిశీలించే అర్హత లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img