ఎలాన్ మస్క్ కు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం షాకిచ్చింది. ఎక్స్ (గతంలో ట్విట్టర్) ప్రధాన కార్యాలయంపై ఏర్పాటు చేసిన ‘X’ లోగోను తొలగించింది. ఇటీవలే ట్విట్టర్ పిట్ట స్థానంలో X వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యoలో బిల్డింగ్ పై పెద్ద లోగోను ఏర్పాటు చేశారు. అయితే లోగోలో ఏర్పాటు చేసిన ప్రకాశవంతమైన లైట్ల కారణంగా రాత్రి పూట ఆ కాంతి నేరుగా తమ కళ్లలోకి వెళ్తోందని, దాని వల్ల తమ నిద్రకు భంగం కలుగుతోందంటూ 24 మంది స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో నగర యంత్రాంగం లోగోను తొలగించింది.