Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దేశ చరిత్రలో మన ఆప్కాబ్ కు మంచి గుర్తింపు .. : సీఎం జగన్

  • దేశ చరిత్రలో మన ఆప్కాబ్ కు మంచి గుర్తింపు ఉందని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఆప్కాబ్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచిందని తెలిపారు. విజయవాడలో శుక్రవారం జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ కొత్త లోగో, స్టాంపును సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కాబ్ అభివృద్దిపై కేంద్రీకరించినట్టుగా సీఎం చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని సీఎం చెప్పారు.డిజిటలైజేషన్ తో రైతులకు మరింత వేగంగా సేవలు అందనున్నాయన్నారు. ఆప్కాబ్ సేవలన్నీ మరింతగా విస్తరించనున్నాయన్నారు. ఆర్‌బీకే స్థాయిలోనే రుణాలు ఇచ్చే పరిస్థితి నెలకొంటుందన్నారు. ఆర్‌బీకేలను ఆప్కాబ్ లతో అనుసంధానించామనిచెప్పారు. ఆర్ బీకేలు రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కాబ్ టర్నోవర్ రూ.36, 732 కోట్లకు చేరిందని సీఎం జగన్ చెప్పారు. 60 ఏళ్ల ఆప్కాబ్ ప్రయాణంలో ఎంతో అభివృద్ది చెందిందన్నారు. విప్లవాత్మక మార్పులు ఆప్కాబ్ అభివృద్దిలో కీలక పాత్ర పోషించాయన్నారు. ఒక్క ఏలూరు డీసీసీబీ మినహా అన్ని డీసీసీబీలు లాభాల్లో నడుస్తున్నాయని గుర్తు చేశారు. రైతులకు ఆప్కాబ్ వెన్ను దన్నుగా నిలిచిందన్నారు. తక్కువ వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నట్టుగా సీఎం వివరించారు. తమ ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను రైతులకు మరింత చేరువగా తీసుకువచ్చిందన్నారు. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ పనిచేస్తుందని సీఎం జగన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img