విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో బెతస్తా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం దళిత విద్యార్థిని ఫీజు చెల్లించలేదన్న కారణంతో పాఠశాల నుంచి బయటకు గెంటివేయడంతో అందుకు నిరసనగా పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉరవకొండ పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ చేయించారు. జూనియర్ కాలేజ్ నుండి ర్యాలీగా బయలుదేరి టవర్ క్లాక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు డిప్యూటీ తాసిల్దారుకి బెతస్తా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పాఠశాలను సీజ్ చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి మధు బాబు జి వి ఎస్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి సాకే.పురుషోత్తం డి జి హెచ్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టబడి సురేష్ బాబు ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చిరంజీవి ఎంఆర్సిఎస్ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ బీజేవైఎం రాష్ట్ర నాయకులు బాలకృష్ణ. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాజశేఖర్ ఆర్ ఎస్ యు జిల్లా అధ్యక్షులు భీమేష్ ఎస్ఎఫ్ఐ సింహాద్రి నాయక్. ఎమ్మార్పీఎస్ నాయకులు గణేష్ ఎంఎంఎస్ మండల అధ్యక్షులు ధనంజయ్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.