Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

సర్.సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల

బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో చాప్టర్ వై20 కార్యక్రమం

కార్యక్రమాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి

విశాలాంధ్ర – ఏలూరు : సర్.సి.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏలూరు, బ్రహ్మకుమారి శ్రీరామనగర్ ఏలూరు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన ఏలూరు చాప్టర్ వై20 కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, కరస్పాండెంట్ రాజు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, రాజయోగిని బికే లావణ్య , ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రేమ్ మసంద్ పాల్గొన్నారు. శ్రీరామనగర్ ఏలూరు సెంటర్ నిర్వాహకురాలు బ్రహ్మకుమారిస్ బికే లావణ్య సిస్టర్ వై ట్వంటీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ బ్రహ్మకుమారి సంస్థ పరిచయాన్ని ఇచ్చారు. ఇది ఒక సోషియో, స్పిరిచువల్, వాలంటరీ ఆర్గనైజేషన్ గా పనిచేస్తూ, విశ్వశాంతి కోసం కృషి చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారానికి యువతను ప్రోత్సహించేలా చాప్టర్ వై 20 కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 30 వరకు కొనసాగుతుందన్నారు.అనంతరం జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి వై ట్వంటీ బ్రోచర్ను విడుదల చేశారు. యువత ఆరోగ్యం శ్రేయోభివృద్ధి కొరకు చాప్టర్ వై20 ప్రోగ్రాం చేపట్టబడిందని, మన పూర్వీకుల కంటే కూడా మనకు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోయాయని, అందరికీ శారీరక, మానసిక ఆరోగ్యం అవసరమన్నారు. మొబైల్ వల్ల, వీడియో గేమ్స్ వల్ల మానసిక అనారోగ్యం కలుగుతుందని, జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ పోటీ ప్రపంచంలో డిప్రెషన్ వల్ల యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మన ఆరోగ్యమే మన సంతోషానికి మూలమన్నారు. అనంతరం బి కే సింధు కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయించారు. డాక్టర్ ప్రేమ మసంద్ మాట్లాడుతూ లైఫ్ ఈజ్ ఏ గేమ్ ఆఫ్ ఛాయిసెస్ అని, మన మైండ్ కండిషనింగ్ వల్ల మన స్వభావం తయారవుతుందని, దీనికి ఉదాహరణగా ఒక చిన్న ఏనుగు పిల్ల పెద్ద గొలుసుతో పెద్ద దొంగకు కట్టబడినప్పటికీ అది పెద్దయ్యాక అదే ఏనుగును చిన్న గొలుసుతో కట్టినప్పుడు కూడా అది తెంచుకొని పారిపోకుండా ఉంటుందన్నారు. దీనికి కారణం మైండ్ కండిషనింగ్ అని పేర్కొన్నారు. మన ఆలోచన సరళి పాజిటివ్, పవర్ ఫుల్ గా, పర్పస్ ఫుల్ గా, ఉండాలన్నారు. స్వయంతో ప్రతి ఒక్కరూ మాట్లాడాలని, అలా మాట్లాడటం వల్ల సానుకూలంగానూ లేదా ప్రతికూలంగానూ పనులు జరుగుతాయన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల అనేక పనులు సాధ్యపడతాయని పేర్కొన్నారు. అందరికీ శారీరక,మానసిక, సామాజిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యం చాలా అవసరమని వివరించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ ప్రేమ మసంద్ చక్కటి సమాధానాలతో వారిని సంతృప్తిపరిచారు. సిస్టర్ బి కే వాణి విద్యార్థులందరికీ మెడిటేషన్ అభ్యాసం చేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img