Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

. ‘అక్రమ వలసదారుల’ గుడిసెల కూల్చివేత
. హరియాణా మత హింసాకాండ తర్వాత చర్యలు

గురుగ్రామ్‌/చండీగఢ్‌:గురుగ్రామ్‌ జిల్లాలో మతపరమైన హింసాకాండ చెలరేగిన కొన్ని రోజుల తర్వాత తౌరు పట్టణంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ శుక్రవారం నుప్‌ా పరిపాలనాధికారులు సుమారు 250 గుడిసెలను బుల్డోజర్‌తో కూల్చివేశారు. హరియాణా షహరీ వికాస్‌ ప్రాధికారన్‌ (హెచ్‌ఎస్‌వీపీ) భూమిని ఆక్రమించిన వారు గతంలో అసోంలో నివసిస్తున్న అక్రమ బంగ్లాదేశ్‌ వలసదారులని, గుడిసెలను గురువారం సాయంత్రం కూల్చివేసినట్లు అధికారి తెలిపారు. అయితే కూల్చివేతకు ఇటీవలి హింసతో సంబంధం లేదని నుప్‌ా డిప్యూటీ కమిషనర్‌ ప్రశాంత్‌ పన్వార్‌ ఖండిరచారు. ఆక్రమణల తొలగింపు సాధారణ ప్రక్రియలో భాగమేనని అన్నారు. ఎకరం స్థలంలో గుడిసెలు నిర్మించుకున్నారని, మూడేళ్లుగా ఇక్కడ నివాసముంటున్నారని పోలీసులు తెలిపారు. సోమవారం విశ్వహిందూ పరిషత్‌ ఊరేగింపుపై గుంపులు దాడి చేయడంతో ముస్లింలు అధికంగా ఉండే నుప్‌ాలో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మత గురువు సహా ఆరుగురు మరణించారు. హింస తరువాత పొరుగున ఉన్న గురుగ్రామ్‌కు కూడా వ్యాపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హింసకు సంబంధించి 141 మందిని అరెస్టు చేశామని, 55 కి పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు గురుగ్రామ్‌లోని పటౌడీ ప్రాంతంలో నుప్‌ా హింసకు వ్యతిరేకంగా హిందూ సంస్థలు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించి బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో పటౌడీ, జటౌలీ, భోరా కలాన్‌ మార్కెట్లు మూతపడ్డాయి. నుప్‌ా హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పటౌడీ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ద్వారా రాష్ట్రపతి, హరియాణా గవర్నర్‌, ముఖ్యమంత్రికి సంస్థలు వినతిపత్రాలు సమర్పించాయి. నుప్‌ాలో పరస్పర సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని, ఈ హేయమైన చర్య ఖండిరచదగినదని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు అజిత్‌ యాదవ్‌ అన్నారు.
200 మందికి పైగా అరెస్టు, 102 ఎఫ్‌ఐఆర్‌లు : హోం మంత్రి విజ్‌ హరియాణాలో ఇటీవల జరిగిన మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 202 మందిని అరెస్టు చేశామని, 80 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నామని రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ విజ్‌ శుక్రవారం తెలిపారు. ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 102 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, వాటిలో సగం ఒక్క నుప్‌ాలోనే ఉన్నాయని, మిగిలినవి గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ మరియు పల్వాల్‌తో సహా ఇతర జిల్లాల్లో ఉన్నాయని విజ్‌ చెప్పారు. ‘ప్రమేయం ఉన్నవారిని విడిచిపెట్టబోమని నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని అంబాలాలో విలేకరులతో అన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అదుపులోకి తీసుకున్న వారిని చట్ట ప్రకారం ప్రశ్నిస్తున్నామని, తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటున్నామని విజ్‌ తెలిపారు. శుక్రవారం నమాజ్‌ గురించి మంత్రి ప్రస్తావిస్తూ, తాను నుప్‌ా, ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌ డిప్యూటీ కమిషనర్లతో మాట్లాడానని, తగిన భద్రతా ఏర్పాట్ల కోసం ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇది కాకుండా హరియాణాలోని మిగిలిన ప్రాంతాల్లో శుక్రవారం నమాజ్‌ ఎక్కడ జరిగినా తగిన భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించినట్లు తెలిపారు. అన్ని భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, కొంతమంది మతపెద్దలు ఇంట్లో నమాజ్‌ చేయాలని పిలుపునిచ్చారని విజ్‌ చెప్పారు. నుప్‌ాలో సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై విజ్‌ మాట్లాడుతూ ‘మేము ఈ సంఘటనను చాలా తీవ్రంగా తీసుకున్నాము. పోలీస్‌ స్టేషన్‌పై ఎవరు దాడి చేశారు, ఎలాంటి రికార్డులను ధ్వంసం చేయాలనుకున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు’ అని వివరించారు. సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు విజ్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజలు శాంతిభద్రతలను కాపాడాలని, సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను షేర్‌ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
పానిపట్‌లో దుకాణం, వాహనాల ధ్వంసం
పానిపట్‌లో నుప్‌ా మత ఘర్షణల్లో మరణించిన వ్యక్తి ఇంటికి సమీపంలో ఉన్న దుకాణాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం సాయంత్రం చికెన్‌ విక్రయిస్తున్న దుకాణాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు సమీపంలో పార్క్‌ చేసిన రెండు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. నుప్‌ా ఘటనలో మరణించిన పౌరుల్లో ఒకరి ఇంటికి సమీపంలోనే ఈ దుకాణం ఉంది. ఆ ప్రాంతంలో పోలీసులను మోహరించినట్లు ఓ అధికారి తెలిపారు. కొంతమంది స్థానిక నివాసితులు విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య సామరస్యం, సోదరభావం ఉందని, ‘శాంతియుత’ వాతావరణాన్ని చెడగొట్టడానికి కొంతమంది దుర్మార్గులు ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పారు. పానిపట్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ విషయం దర్యాప్తులో ఉందని అన్నారు. పరిస్థితి ప్రశాంతంగా ఉందని, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img