Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మణిపూర్ లో భారత మాతను చంపేశారు..

మోడీ సర్కార్ పై అవిశ్వాస చర్చలో రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రలో తన అనుభవాలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభలో తెలిపారు. ప్రజల కష్టాలను దగ్గరుండి చూసినట్టుగా చెప్పారు. గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్దనేతకు ఇబ్బంది అనిపించిందేమోనని పరోక్షంగా ప్రధానిపై రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. అదానీ గురించి ఈ రోజు మాట్లాడను, మీరు భయపడాల్సిన పనిలేదన్నారు. తనది రాజకీయ ప్రసంగం కాదన్నారు. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస చర్చలో రాహుల్ గాంధీ ఇవాళ పాల్గొన్నారు. ఓవైపు బీజేపీ నేతల నినాదాలు కొనసాగుతుండగానే రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు రాహుల్ గాంధీ లోక్ సభ స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల తాను చేసిన భారత్ జోడో యాత్రను సభలో ప్రస్తావిస్తూ..భారత్ జోడో యాత్ర తన అహంకారాన్ని అణచివేసిందని చెప్పారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.భారత్ జోడో యాత్ర ఇంకా ముగియలేదన్నారు. లడ్డాఖ్ వరకు తాను యాత్ర చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ యాత్రలో ప్రజల సమస్యలను తాను దగ్గరుండి చూసినట్టు చెప్పారు. పాదయాత్రలో అనేక అంశాలను తాను నేర్చుకున్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. లక్షల మంది తనతో కలిసి రావడంతో తనకు ధైర్యమొచ్చిందని ఆయన తెలిపారు. పాదయాత్ర చేసే సమయంలో తనలో కొద్ది కొద్దిగా అహంకారం మాయమైందని ఆయన వివరించారు. పాదయాత్రలో తాను అనేక విషయాలను నేర్చుకున్నట్టుగా చెప్పారు.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణం మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండేనని రాహుల్ గాంధీ లోక్ సభలో స్పష్టం చేశారు. మణిపూర్ కూడా భారత్ లో భాగమేనని కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. అక్కడి ప్రజల కష్టాలను, సమస్యలను తీర్చాలని సూచించారు. ఇటీవల తాను మణిపూర్ వెళ్లానని రాహుల్ చెప్పారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకూ వెళ్లలేదని, ఎందుకంటే వారి దృష్టిలో మణిపూర్ మన దేశంలో భాగం కాదని ఆరోపించారు. మణిపూర్ ను కేంద్ర ప్రభుత్వం రెండుగా చీల్చిందని, అక్కడ భారత మాతను చంపేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మణిపూర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిరాశ్రయుల క్యాంపులో మహిళలను, చిన్నారులను కలిశానని రాహుల్ గాంధీ చెప్పారు. ఓ మహిళ తనతో మాట్లాడుతూ.. తను ఎదుర్కొన్న దారుణమైన కష్టాలను చెప్పుకుందని వివరించారు. తనకు ఒక్కడే కొడుకని, ఆ కొడుకును తన కళ్ల ముందే కాల్చి చంపారని చెబుతూ కన్నీటి పర్యంతమైందని రాహుల్ చెప్పారు. రాత్రంతా తన కొడుకు మృతదేహం వద్దే ఉన్నానని, తెల్లవారాక భయంతో కట్టుబట్టలతోనే అక్కడి నుంచి వచ్చేశానని చెప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే.. భారత సైన్యం రంగంలోకి దిగితే మణిపూర్ లో శాంతిని నెలకొల్పడం కేవలం ఒక్కరోజులోనే సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్ లో శాంతి నెలకొనడం ఇష్టంలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img