Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం

సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

విశాలాంధ్ర – ఆస్పరి : మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ఎంపీపీ సుంకర ఉమాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు సభ్యులు పలు సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సి డబ్ల్యూ స్కీం కింద అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించాలని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ వారు విద్యార్థి బస్సులను నడపాలని, పలు గ్రామాలకు లింకు రోడ్లు ఏర్పాటు చేయాలని తంగరడోన ఎంపీటీసీ నరసప్ప సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అట్టేకల్లు గ్రామ పంచాయితీ ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు పంచాయతీ భవనాన్ని ఏర్పాటు చేయలేదని, అధికారులు ఎవరు సర్పంచ్ మాట వినడం లేదని, గ్రామంలో నెలకొన్న సమస్యలను ఇంచార్జి పంచాయితీ కార్యదర్శి పట్టించుకోవడంలేదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఎవరు పట్టించుకోవడంలేదని సర్పంచ్ లత నిలదీశారు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశానికి మండల స్థాయి అధికారులు రాకపోవడం చాలా సిగ్గుచేటని, సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు అందజేసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని పలువురు ప్రజాప్రతినిధులు ఎంపీపీ, ఎంపీడీవోలను కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రాణమ్మ, డిప్యూటీ తాసిల్దార్ గాయత్రి, ఏవో నరేంద్ర కుమార్, ఎంఈఓ రాజేంద్రప్రసాద్, ఐసిడిఎస్ సిడిపిఓ నిర్మలాదేవి, ఎపిఓ కళ్యాణ్ చక్రవర్తి, ఏపిఎం రాఘవేంద్ర, మండల ఏఈ లు నరేష్, మల్లికార్జున, యమునప్ప, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img