Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

బీజేపీ నేత వ్యాఖ్యలు అర్థరహితం

. బెదిరింపు, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు తగవు
. ఇది తెలుగు జాతి ఆత్మగౌరవానికి పరీక్షా సమయం
. టీడీపీ నేతలు స్పందించాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర`గుంటూరు : మాతో పొత్తు కావాలని కోరుకుంటున్న నేతలు మా అధిష్ఠానంతో మాట్లాడాలి… మాతో పొత్తు కావాలని పవన్‌కళ్యాణ్‌ చెప్పడం కాదు… టీడీపీతో కూడా చెప్పించాలి… యువగళం వేదిక మీద బీజేపీతో పొత్తుపై లోకేశ్‌తో పవన్‌ మాట్లాడిరచి ఉండాల్సింది… అంటూ బీజేపీ నేత సత్యకుమార్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీని బెదిరిస్తున్నారో… బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారో… ఆదేశిస్తున్నారో అర్థం కాలేదన్నారు. గుంటూరు మల్లయ్యలింగం భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక కేంద్రంలోని బీజేపీ ఉందనే విషయం రాష్ట్రంలో ప్రతిఒక్కరికి తెలుసని, బీజేపీ సహకారంతోనే చంద్రబాబును 53 రోజులు జైలులో ఉంచారని అన్నారు. బీజేపీ, వైసీపీ కూడబలుక్కుని ఇదంతా చేశాయనేది సుస్పష్టమన్నారు. సుప్రీం కోర్టులో వాదనలు ముగిసి 70 రోజులు పైబడినా తీర్పు వెలువరించకపోవడం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. ఇంతా చేసి పొత్తుల గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. అసలు ఆంధ్ర ప్రదేశ్‌కు బీజేపీ ఏమి చేసిందని నిలదీశారు. ప్రత్యేక హోదా ఇచ్చిందా, విభజన హామీలు అమలు జరిపిందా అంటూ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలు వైసీపీని నెత్తిన పెట్టుకుని తిరిగిందని, ఒకరకంగా రాష్ట్రం అప్పుల పాలైపోవడానికి బీజేపీ కూడా ఒక కారణమని అన్నారు. బెదిరింపు, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్న తీరు చూస్తుంటే అసలు రాజకీయ స్వాతంత్య్రం ఉందా అనే సందేహం తలెత్తుతోందన్నారు. ఏ సదాశయం కోసం ఆనాడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారో… ఆ ఆశయానికి తూట్లు పొడిచేలా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఇది పరీక్షా సమయమని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతల బెదిరింపులకు లొంగిపోదని భావిస్తున్నామన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి టీడీపీ నేతలు తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో జగన్‌మోహన్‌ రెడ్డిని గద్దె దించడమే అజెండాగా సీపీఐ ముందుకు పోతుందని, దీనికి కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోతామని చెప్పారు.
సమస్యలపై స్పందించే సమయం లేదా?
తమ న్యాయమైన డిమాండ్ల కోసం లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తుంటే దీనిపై స్పందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి తీరిక లేకపోవడం శోచనీయమని రామకృష్ణ అన్నారు. కనీస వేతనాలు, ఇచ్చిన హామీల అమలు కోసం అతి తక్కువ వేతనాలకు పని చేస్తున్న స్కీమ్‌ వర్కర్లతో పాటు మున్సిపల్‌ కార్మికులు, సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, వలంటీర్‌లు, యానిమేటర్‌లు రోడ్లపైకి వస్తున్నారని, దీనికి ప్రధాన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని సూచించారు.
రోమ్‌ నీరో చక్రవర్తి ఫిడెల్‌ వాయిస్తే… ఇక్కడ మన నీరో చక్రవర్తి ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీల బదిలీలలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి ఒక రోజు కేటాయించి నాయకులను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అయోధ్య రామాలయ ప్రతిష్ఠా మహోత్సవాన్ని బీజేపీ ఎన్నికల ఆయుధంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న జరిగే ఈ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని రాముని అక్షింతల పంపిణీ కార్యక్రమానికి తెరతీసిందని, తద్వారా ఎన్నికల లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మరోవైపు, రాష్ట్రంలో అంబేద్కర్‌ వాదుల ఓట్ల కోసం ఈ నెల 19న అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సిద్ధం అవుతున్నారని అన్నారు. కుటుంబ వ్యవస్థను దూరంగా పెట్టిన మోదీకి రామాలయాన్ని ప్రారంభించే అర్హత లేదని, అదేవిధంగా అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న జగన్‌కు అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఒకవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులకు తెగబడుతూ, మరోవైపు అమరావతి రైతులకు చెల్లించాల్సిన కౌలును తొమ్మిది నెలలుగా చెల్లించకుండా వారిని చిత్రహింసలకు గురిచేస్తున్న జగన్‌… సీఎంగా రాష్ట్రాన్ని పాలించే అర్హతను కోల్పోయారని అన్నారు. అమరావతి రైతులకు కౌలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ అధ్వర్యంలో ఈ నెల 8న సీఆర్‌డీఏ కమిషనర్‌ వద్దకు ‘రాయబార యాత్ర’ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో అమరావతి రాజధాని రైతులు, కౌలు రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img