Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పెన్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

లబ్ధిదారులకు సూచించిన ఎంపీటీసీ సభ్యురాలు జయలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పెంచిన మూడు వేల రూపాయల పెన్షన్ పథకాన్ని లబ్ధిదారులు అంతా సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు చిందాడ జయలక్ష్మి అన్నారు. పెంచిన వైయస్సార్ పెన్షన్ పథకాన్ని స్థానిక ఎస్సీ కాలనీలో ఆదివారం ఆమె ప్రారంభించారు. వాలంటీర్లతో కలిసి 3000 రూపాయల పెన్షన్ ను లబ్ధిదారులకు ఆమె అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం నిరుపేదలకు వరమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మూడు వేల రూపాయల పెన్షన్ తో వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైకాపా అన్నారు. అర్హత ఉండి పథకాలు పొందలేని ఎంతోమందికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అందజేసి రాజకీయ పార్టీలకు అతీతంగా పెన్షన్ కు అర్హత కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ ప్రభుత్వాన్ని రాబోవు ఎన్నికల్లో మరో మారు ఆశీర్వదించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం ధారబాబు, వాలంటీర్లు, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img