Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గిరిజనుల ప్రాణాలతో వైద్యారోగ్య శాఖ చెలగాటం

ఒక్కో పీ హెచ్ సీ లో ఇద్దరేసి వైద్యులున్నా సత్ఫలితాలు నామమాత్రం.

పని చేసేవారు ఒక్కరున్నా చాలు, పనిచేయని వారు ఎంత మంది ఉన్నా ఉపయోగమేమి.

అవస్థలు పడి ఆసుపత్రికి వచ్చినా అందుబాటులో వైద్యులు లేక ప్రసవ వేదనతో అల్లాడిన గర్భిణలు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా చర్యలు శూన్యం.

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- మాతా శిశు మరణాలు లేకుండా చూడడమే లక్ష్యంగా మన్యంలో ఆరోగ్య సేవలు మెరుగు పరచాలనే సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక ఆరోగ్య పధకాలకు రూప కల్పన చేసి అమలు చేస్తుంటే మన్యంలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. మన్య ప్రాంతంలో తరతరాలుగా కనీస మౌలిక సదుపాయాలు లేక అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు, వ్యాధిగ్రస్తులను అతి కష్టం మీద డోలీ మోతతో సమీప ఆసుపత్రులకు తరలించిన సందర్భాలు అనేకం. ఇటువంటి పరిస్థితులను అధిగమించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ పీ హెచ్ సీ లో కనీసం ఇద్దరు వైద్యులు ఉండాలని సంకల్పించి ఆ విధంగా నియామకాలు చేసినప్పటికీ మన్యంలో పని చేసే పలువురు వైద్యులు సకాలంలో స్పందించని కారణంగా సమస్యలు తలెత్తు తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మండలంలో చోటు చేసుకున్న పలు సంఘటనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటీవల కోరుకొండ ప్రాధమిక అరోగ్య కేంద్రం పరిధిలోని బూరుగు బయలు, జోహారు గ్రామాలకు చెందిన ఇరువురు గర్భిణీ లు ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చిన సందర్భంలో అక్కడ వైద్య సేవలు అందించవలసిన ఇరువురు వైద్యుల లో ఆ రోజు ఒక్క వైద్యాధికారి కూడా అందుబాటులో లేక పోవడం, ఆ సమయంలో ఒక్క ఏ ఎన్ ఎం తప్ప మిగిలిన సిబ్బంది కూడా విధులలో కనిపించక పోవడం గమనార్హం. వైద్యులు ఎక్కడకు వెళ్లారని గర్భిణీ ల కుటుంబ సభ్యులు అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పిన ఏ ఎన్ ఎం అత్యవసరమైతే తానే ప్రసవం చేసేస్తానని చెప్పడం గర్భిణీ ల కుటుంబ సభ్యులను విస్మయానికి గురి చేసింది. ఈ విషయమై సంభందిత ఉన్నతాధికారిని వివరణ కోరగా ఆ సమయంలో విధులలో లేని వైద్యులు, వైద్య సిబ్బంది పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటానని చెప్పి నేటికీ చర్యలు తీసుకున్న. దాఖలాలు లేవు. క్రింది స్థాయి సిబ్బంది అనివార్య కారణాల వల్ల విధులకు కాస్త ఆలస్యం అయితే వెంటనే మెమో లిచ్చి ఇబ్బంది పెట్టే ఉన్నతాధికారులు ఇటువంటి సంఘటన ల నేపథ్యంలో వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోక పోవడానికి కారణాలు ఏమిటో సంబంధిత ఉన్నతాదికారులకే తెలియాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img