Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ప్రభుత్వ విధానాలతోకునారిల్లుతున్న చేనేత రంగం

. జీఎస్‌టీ నుంచి మినహాయించాలి
. సొసైటీలకు బకాయిలు చెల్లించి, రిజర్వేషన్లు కొనసాగించాలి
. చేనేత రంగ రక్షణకు ఈ మహాసభ వేదిక కావాలి
. ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీవీ సత్యనారాయణమూర్తి

విశాలాంధ్రమంగళగిరి/తాడేపల్లి : దేశంలో వ్యవసాయ రంగం తరువాత అతి పెద్ద రంగమైన చేనేత రంగం ప్రభుత్వాల విధానాల కారణంగా నిరాదరణకు గురై కూనరిల్లుతోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీవీ సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళగిరి మార్కండేయ పద్మశాలీయ కళ్యాణ మండపంలో రెండు రోజులపాటు జరగనున్న ఆంధ్ర ప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం 13వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చేనేత నాయకులు చిమ్మన నాగభూషణం, అందే నరసింహారావు పేర్లతో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో మహాసభను ముప్పాళ్ల ప్రారంభించారు. ఉదయం జరిగిన ప్రారంభోత్సవ సభకు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా హేమసుందర్‌ రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పామిశెట్టి గోవిందు, గొట్టిముక్కల లక్ష్మి అధ్యక్షత వహించారు. ముప్పాళ్ల మాట్లాడుతూ దేశంలో సుమారు 7 కోట్ల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఇటువంటి రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం శోచనీయమని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో దాదాపు 1.50 లక్షల మగ్గాలు ఉన్నాయని, వీటిపై లక్షలాది మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. ఒక్క మంగళగిరి పట్టణంలోనే 20 వేల మగ్గాలు ఉండేవని, నేడు అవి వందల సంఖ్యలోకి వచ్చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చేనేత రంగానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడమే అందుకు కారణమని విమర్శించారు. రాష్ట్రంలో సొంత మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకు రూ.24 వేలను ప్రభుత్వం అందిస్తుందని, అయితే సొంత మగ్గాలు ఉన్న వారికంటే అద్దె మగ్గాలపై పొట్టికూటి కోసం కష్టపడే కార్మికులకు ఈ పథకాన్ని అమలు చేయకపోవడం దారుణమన్నారు. చేనేత రంగాన్ని అత్యంత ప్రాధాన్యతా రంగంగా గుర్తిస్తామని ఎన్నికల హామీలు ఇచ్చిన నాయకులు దానిని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేనేత రంగానికి ప్రతి సంవత్సరం రూ.4 వేలు కోట్లు కేటాయిస్తామని చెప్పి కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. చేనేత కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం ఏర్పాటు చేసిన వైద్య పథకాన్ని సైతం మోదీ ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. చేనేత రంగాన్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు రంగులు, రసాయనాలపై పన్నుల భారాలు మోపి చేనేత రంగాన్ని మరణశయ్య పైకి తీసుకువెళుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చేనేత రంగాన్ని రక్షించుకోవడం కోసం ఇటువంటి మోసకారి ప్రభుత్వాలను గద్దె దించాల్సిన అవసరం ఉందని ముప్పాళ్ల పిలుపునిచ్చారు. చేనేత పరిశ్రమ పరిరక్షణకు, చేనేత కార్మికులకు మెరుగైన జీవితాలను అందించడానికి అవసరమైన కార్యాచరణను ఈ మహాసభ రూపొందిస్తుందని ఆకాంక్షించారు. సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. చేనేత నైపుణ్యంతో కూడుకున్న కళ అని, దానిని నమ్ముకుని దేశ వ్యాప్తంగా 75 లక్షల మగ్గాలు పని చేస్తున్నాయని చెప్పారు. చేనేతను పరిరక్షించుకోవడం కోసం అనేక పోరాటాలను నిర్వహించి 11 రకాల రిజర్వేషన్లను సాధించుకున్నట్లు తెలిపారు. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టిన తర్వాత చేనేత రంగానికి ఉన్న సంస్థలను రద్దు చేశారన్నారు. చేనేత రంగానికి ఉన్న చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని పాలకులకు సూచించారు. రిజర్వేషన్లను యథాతధంగా అమలు చేయాలని, జీఎస్‌టీ నుంచి చేనేత రంగాన్ని మినహాయించాలని, ఆప్కో ద్వారా మరింతగా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని, చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్న నేటి ప్రభుత్వ పథకాలను రద్దు చేయాలని, సొసైటీల బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆల్‌ ఇండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులు బండారు ఆనందప్రసాద్‌, రాష్ట్ర అధ్యక్షులు ఇనమాల శివరాంప్రసాద్‌, ఆంధ్ర ప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, చేనేత కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు రామనాథం పూర్ణచంద్రరావు, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కూరపాటి కోటేశ్వరరావు, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు జొన్నాదుల వరప్రసాద్‌ (మణి), చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు ప్రసంగించారు. తొలుత చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లలమర్రి నాగేశ్వరరావు వక్తలను ఆహ్వానించారు. చేనేత కార్మిక సంఘం జెండాను జేవీవీ సత్యనారాయణమూర్తి ఆవిష్కరించారు. అనంతరం మృతవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభ ప్రారంభానికి ముందు ఎన్నారై వైజంక్షన్‌ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చిన్ని సత్యనారాయణ, అన్నవరపు ప్రభాకర్‌, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img