విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం తహశీల్దారు పి.తిరుమల బాబు 2024 సార్వత్రిక ఎన్నికల బదిలీ పై శ్రీకాకుళం వెళుతున్నారు. ఈయన స్థానంలో శ్రీకాకుళం జిల్లా సింగడాం నుండి పి.వేణు గోపాలరావు నూతన తహసీల్దార్ గా నియమితులైనట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కొత్త తహసీల్దార్ వేణుగోపాల రావు గురువారం మధ్యాహ్నం భాధ్యతలు స్వీకరించనున్నారు.