Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

వైసీపీ ఆరో జాబితా

. నలుగురు ఎంపీ, ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు
. మైలవరం ఎమ్మెల్యే వసంతకు షాక్‌ బ చిత్తూరుకు తిరిగి రెడ్డప్ప
. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి ఊరట
. నెల్లూరు టౌన్‌లో డిప్యూటీ మేయర్‌

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఎన్టీఆర్‌జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు వైసీపీ ఆధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. ఆయన స్థానంలో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మైలవరం జెడ్పీటీసీ నర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియమించింది. వైసీపీ ఇన్‌ఛార్జిల ఆరో జాబితాను శుక్రవారం రాత్రి మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఇందులో ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులున్నారు. నాలుగు ఎంపీ అభ్యర్థులు, ఆరు అసెంబ్లీ అభ్యర్థులతో స్వల్ప సవరణలతో జాబితాను ప్రకటించారు. వైసీపీలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జెడ్పీటీసీ, డిప్యూటీ మేయర్లకు ఎమ్మెల్యే, ఎంపీ ఇన్‌ఛార్జిలుగా నియమించారు. ఈ జాబితాలో రాజమండ్రి, నర్సాపురం, గుంటూరు, చిత్తూరు ఎంపీ అభ్యర్థులను వెల్లడిరచారు. వారిలో చిత్తూరు సిట్టింగ్‌ ఎంపీని యథాతథంగా ఉంచారు. ఇంతకుముందు జాబితాలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగాను, ఆయన స్థానంలో చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డప్పను ప్రకటించిన విషయం విదితమే. ఆ జాబితాలో సవరణ చేసి, చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పను, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణస్వామిని యథాతథంగా ఉంచారు. నారాయణస్వామిని చిత్తూరు ఎంపీగా నియమించడంతో కొంత అసంతృప్తి వ్యక్తంచేశారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది గూడూరి ఉమాబాలను

నియమించారు. ప్రస్తుత వైసీపీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్థానంలో ఆయనను ఖరారు చేశారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు ఉమ్మారెడ్డి వెంకట రమణకు బాధ్యతలు అప్పగించారు. గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో కాపు సామాజిక ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఆయనను ఎంపిక చేశారు. మైలవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణాప్రసాద్‌ పార్టీకి దూరమవుతున్నారన్న సంకేతాలు రావడంతో, అంతకు ముందస్తుగానే బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మైలవరం జెడ్పీటీసీ నర్నాల తిరుపతిరావు యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరు డిప్యూటీ మేయర్‌ ఎండీ ఖలీల్‌ను నియమించారు. ప్రస్తుత నెల్లూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా గత జాబితాలో ఆధిష్ఠానం ప్రకటించింది. దీంతో ఆయన స్థానంలో ముస్లింలకు సముచిత స్థానం కల్పించేందుకు ఖలీల్‌కు బాధ్యతలు కేటాయించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఇన్‌ఛార్జిగా నియమించారు.గతంలో ఇదే స్థానానికి నియమించిన ఇన్‌చార్జిగాపై తీవ్ర వ్యతిరేకత రావడంతో బుట్టాకు బాధ్యతలిచ్చారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక కోణం, గెలుపే లక్ష్యంగా సుదీర్ఘ కసరత్తు అనంతరం జాబితాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు జాబితాల ద్వారా 65 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది ఎంపీ అభ్యర్థులను ఇన్‌ఛార్జిలుగా నియమించారు.
ఎంపీ, ఎమ్మెల్యే ఇన్‌ఛార్జులు వీరే:

  1. రాజమండ్రి (ఎంపీ) : డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌
  2. నర్సాపురం (ఎంపీ) : గూడూరి ఉమాబాల(న్యాయవాది)
  3. గుంటూరు (ఎంపీ) : ఉమ్మారెడ్డి వెంకట రమణ
  4. చిత్తూరు (ఎంపీ) (ఎస్సీ) : ఎన్‌. రెడ్డప్ప
  5. మైలవరం (ఎమ్మెల్యే) : సర్నాల తిరుపతిరావు యాదవ్‌
  6. మార్కాపురం : అన్నా రాంబాబు
  7. గిద్దలూరు : కె.నాగార్జునరెడ్డి
  8. నెల్లూరు సిటీ : ఎండీ ఖలీల్‌(డిప్యూటీ మేయర్‌)
  9. జీడీ నెల్లూరు :కె.నారాయణస్వామి
  10. ఎమ్మిగనూరు :బుట్టా రేణుక

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img