Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే అవగాహన సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం..

ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సు చైర్పర్సన్, రిటైర్డ్ జడ్జ్ వి శ్రీనివాస్ ఆంజనేయ మూర్తి.
విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యము అని ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సు చైర్పర్సన్, రిటైర్డ్ జిల్లా జడ్జి వి శ్రీనివాస్ ఆంజనేయ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద గల సబ్ స్టేషన్ లో పట్టణ రూరల్ పరిధిలోని వినియోగదారులకు ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు దాదాపు 60 మంది దాకా వినియోగదారుడు హాజరై చిన్న, పెద్ద సమస్యలను వారు విన్నవించుకున్నారు. తదుపరి శ్రీనివాస్ ఆంజనేయ మూర్తి మాట్లాడుతూ విద్యుత్ వినియోగంపై వినియోగదారులకు ఉన్న సమస్యలను తీర్చేందుకే ఈ పరిష్కార వేదికను ఏర్పాటు చేశామని, రైతులు, ప్రజలుకు గల సమస్యలను విన్నవించుకోవడం జరిగిందని తెలిపారు. ట్రాన్స్ఫారములు కోరుటకుర్చీ, ఇళ్ల పైన విద్యుత్ వైర్లు గూర్చి, విద్యుత్ లైన్ మార్పులు గూర్చి తోపాటు ఎన్నో సమస్యలు రావడం జరిగిందని తెలిపా రు. మొత్తంలో ఈ పరిష్కార వేదికలో ఐదు సమస్యలు రావడం జరిగిందని, వాటిని ప్రకటించిన గడువు తేదీలోగా కచ్చితంగా చేయాలని తెలుపుతూ సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కానీ ఈ ప్రత్యేక పరిష్కార వేదికపై ఇంకనూ ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారుల మీద ఉందని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో లైన్ మార్పుల్లో ఒకటి, మూడు ట్రాన్స్ఫార్ములు, ఇళ్లపై పెద్ద లైను మార్పు లాంటి సమస్యలు రావడం జరిగిందని తెలిపా రు. ఏది ఏమైనా వినియోగదారులకు సమస్యలు లేకుండా ఉండేందుకు మరింత కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏఓ- బాలాజీ వెంకటేష్, ఏడిఈ- నాగేంద్ర, ఏఏఓ రామకృష్ణ, విద్యుత్ ఏఈలు ధర్మవరం- డి-1 నాగభూషణ, ఢీ 2 కొండారెడ్డి, రూరల్ ఏఈ జానకి రామయ్య, కార్యాలయ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img