Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రాక్టికల్స్ ఫీజులు పేరుతో వసూలు చేస్తున్న ప్రైవేట్ కళాశాలపై చర్యలు గైకొనండి…

ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు- శివ.

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో ప్రాక్టికల్స్ ఫీజులు పేరుతో వేలాది రూపాయల డబ్బును విద్యార్థులతో వసూలు చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు గైకొనాలని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు శివ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న వాసవి మహిళ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం వారు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా రెండవ శనివారం, ఆదివారం అనేది కూడా లేకుండా అదనపు తరగతులు నిర్వహించడం దారుణమని తెలిపారు. అలాగే ర్యాంకుల కోసం విద్యార్థులను వేధిస్తున్నారని, అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇష్టానుసారంగా విద్యార్థుల నుండి ప్రాక్టికల్స్ ఫీజుల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, కనీసం ఫీజు విద్యార్థులతో 300 రూపాయల నుంచి 500 రూపాయలకు ఉంటే వాటిని పక్కనపెట్టి ప్రతి విద్యార్థితోను 200500 నుంచి 3 వేల రూపాయల వరకు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇందులో భాగంగా వాసవి మహిళా ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు గైకొనాలని కోరుతూ ఇంచార్జ్ ఆర్ ఐ ఓ కు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రదీప్, రాజా, పవన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img