Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

యువతకు జగన్‌ ద్రోహం

. నాలుగున్నరేళ్ల తర్వాత దగా డీఎస్సీనా?
. వైసీపీ ప్రభుత్వంపై రామకృష్ణ, శ్రీనివాసరావు ఆగ్రహం
. షర్మిల ఆందోళనకు సంఫీుభావం
. కాంగ్రెస్‌ నేతల అరెస్టుకు ఖండన

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు సంఫీుభావం తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్నభవన్‌కు సీపీఐ, సీపీఎం నేతలు గురువారం వెళ్లి షర్మిల చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. షర్మిలను, కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ అధికారం చేపట్టగానే మెగా డీఎస్సీ ఇస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాడు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీ అమలు చేయకుండా యువతను మోసగించారన్నారు. నాలుగున్నరేళ్లు దాటాక దగా డీఎస్సీ ప్రకటించారని విమర్శించారు. యేటా జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండరు ప్రకటిస్తానన్న హామీని సైతం విస్మరించారని మండిపడ్డారు. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన యువతకు ద్రోహం చేశారని ఆరోపించారు. చదువుకున్న యువతీ యువకులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ షర్మిల ఆందోళన చేపడితే ఆమెను పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసి, పోలీసు స్టేషన్‌కు తరలించారని, రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఏ కార్యక్రమం తలపెట్టినా పోలీసులు ప్రత్యక్షమై ముందస్తు నిర్బంధాలకు, అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులపై వైసీపీ మూకల దాడులను నిరసిస్తూ అనంతపురంలో శాంతియుత ర్యాలీ, ధర్నాలకు పిలుపునివ్వగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులను గృహ నిర్బంధం చేయడం, నోటీసులిచ్చి ఉక్కుపాదం మోపారని మండిపడ్డారు. సీఎం జగన్‌ హయాంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, దిల్లీకి రైతులను రానీయకుండా అష్టకష్టాలు పెడుతోందన్నారు. తాజాగా 21 ఏళ్ల యువ రైతు మరణించడం బాధాకరమని, అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను నియంతృత్వ, నిరంకుశ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజాతంత్రవాదులంతా కలసి రావాలని కోరారు.
సీపీఎం నేత వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యావంతులైన యువతకు వైసీపీ ప్రభుత్వం పదేపదే అన్యాయం చేస్తోందని, ఐదేళ్లలో ఎక్కడా ఉద్యోగాలిచ్చిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు మెగా డీఎస్సీకి బదులుగా దగా డీఎస్సీ ప్రకటించి, నిరుద్యోగ యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. యువతకు జరుగుతున్న అన్యాయంపై షర్మిల చేపట్టిన శాంతియుత ఆందోళనను అడ్డుకోవడం తగదని, వామపక్ష పార్టీలుగా షర్మిల నిరసనకు సంఫీుభావం తెలుపుతున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img