Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పుస్తకాలు చూస్తూ పరీక్షలు రాసే విధానం..

ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న సీబీఎస్ఈ
9 నుంచి 12వ తరగతి వరకు ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానం

సీబీఎస్ఈ అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పుస్తకాలను చూసి పరీక్షలు రాసే పద్ధతిని ఈ ఏడాడి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబోతున్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ విధానం ద్వారా పరీక్షలను నిర్వహించబోతున్నారు. 9, 10 తరగతుల్లో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు… 11, 12 తరగతుల్లో ఇంగ్లీష్, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ను ప్రవేశపెడుతున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ పరీక్షల్లో… విద్యార్థులకు పరీక్ష రాయడానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని నిపుణులు గమనించనున్నారు. అంతేకాదు ఈ పరీక్షా విధానంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించనున్నారు. ఓపెన్ బుక్ ఎగ్జామ్ పద్ధతిలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు పుస్తకాలు, అధ్యయన సామగ్రిని తీసుకెళ్లవచ్చు. వాటిని చూస్తూ ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. అయితే పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు కూడా విద్యార్థి సమస్యా పరిష్కార శక్తి, సృజనాత్మకత, తార్కిక ఆలోచనా పద్ధతిని బేరీజు వేసేలా ఉంటాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img